అనుకోకుండా వెళ్ళానక్కడికి. అయిష్టంగా.
స్కేట్ క్లాస్
మందారమా...మాటాడుమా...
మందారమా..మాటాడుమా...పొగమంచుకు తలుపులు తీస్తే పాటని తన చుట్టూ తిప్పుకుంటూ వస్తుంది దేవి. ఆమె గిన్నెలు తోముతున్నంత సేపూ ఆ రెండు మాటలే కూనిరాగాలై వంటిల్లంతా తిరుగుతాయి. మందారం మాటాడకుండా ఎందుకుంటుంది. రొమాన్సింగ్ అక్కా..నువ్వు చూళ్ళేదా కాంతారా! నవ్విపోతుంది. చందనపు చెక్క పట్టపగలే గుండెల్ని గుచ్చుకుంటుంది.
శివతాండవ సహాయవల్లి- పరిమి శ్రీరామనాథ్
గొప్ప కవిత్వం అని దేన్నైనా పిలవడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క తూనికరాయి లోలో ఎగసే స్పందన. మంచి కవిత్వం చదువుతుండగానే నాకు అనుభవమవుతుంది, నాలో కంపన కలిగిస్తుంది. హృదయంలో నిర్లక్ష్యం చేయ వీల్లేని మోతాదులో ఉత్సాహం తుళ్ళిపడుతుంది. ఒక కొత్త మనిషితో ఇష్టంగా ఏర్పడ్డ పరిచయంలోని ఆహ్లాదమో, ఒక కొత్త పాఠం స్వయంగా నేర్చుకుని అర్థం చేసుకున్న సత్యం లోపల రేకెత్తించే ఉద్వేగమో, నరాల్లో పొంగులా ఉరకలెత్తే అకారణ సంతోషమో- మంచి కవిత్వాన్ని చదువుతున్నప్పుడు అనాయాసంగా అనుభవంలోకి వస్తుంది. తరచి, వివేచించి, తర్కంతో మేధతో ప్రతిపదార్థ తాత్పర్యాలను ఇంకించుకుంటూ విశ్లేషించుకునేలోపే, గొప్ప కవిత్వం నిశ్శబ్దంగా లోలోపల స్థానం స్థిరపరచుకుంటుంది. అయితే, ఒక బలమైన విమర్శ ఆ కవిత్వానికి దొరకడమంటే, క్షణికోద్రేకంలా ఎగసిన ఆ ఆవేశాలకు ఒక ఆమోదముద్ర దొరకడం లాంటిది. అట్లాంటి విమర్శ, పాఠకుడు పొందిన అపురూపమైన అనుభవానికి ఇంకాస్త బలాన్ని, జీవాన్ని, పొడిగింపునీ ఇస్తుంది.
సరస్వతీపుత్ర శ్రీనారాయణాచార్యుల వారి శివతాండవం అట్లాంటి మహాకావ్యమైతే, ఆ కవిత్వ బలిమిని వేయందాల ప్రకటించిన వ్యాఖ్య - మిత్రులు శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి శివతాండవ సహాయవల్లి.
TGIF
పొగమంచు వాకిట్లో
సౌందర్యప్రతిమలా
మట్టిప్రమిద
గుమ్మం పక్క వైరుబుట్టలో
పాలపేకట్లు.
ఇంకా విప్పని న్యూస్‌పేపర్ ముడి
11 నవంబరు, 2022.
శుక్రవారం.
ఈవాల్టి ఉత్సాహానికి
ఇవాళన్నదే కారణమవడం- ఆహా!
ఆకాశం నుండి బాల్కనీలోకి
బంగారు కాంతుల వంతెన
ఎర్ర మట్టి కుండీలో
లేతగా మెరుస్తూ మెంతాకులు.
పచ్చిపాలపొంగు వాసనల మధ్య
టేబుల్ మీద మూడు కప్పులు,
వాటి చుట్టూ వారాంతపు సరదాలు
వారాంతానికే వాయిదా పడే పనులు
అనుభవిస్తేనే అర్థమయ్యే
మెత్తని నూలుబట్టల సౌకర్యంలో
కాల్స్, కాన్సిల్డ్ మీటింగ్స్ మధ్య
చూస్తూ చూస్తూండగానే 3 PM రిమైండర్.
స్పోర్ట్స్ క్లాస్ దుమ్మునీ
సంబరాలనీ దులుపుకుంటూ
స్కూల్ బస్. బుజ్జాయి హాయి నవ్వూ.
Comeon comeon turn the radio on..
వీధవతలి పార్టీ మ్యూజిక్‌ని
లీలగా మోసుకొచ్చే సాయంకాలపు చలిగాలి
మునిచీకట్లను కోస్తూ
వీధిదీపాల పసుపు వెలుతురు
విద్యుద్దీపతోరణాల నడుమ
కుదురుగా ఓ కార్తీకదీపం
కాంతులన్నిటినీ లయం చేసుకుంటూ
తదియ వెన్నెల రేయి
దోసగింజ బొట్టుబిళ్ళ
వంగపూల తెల్లదుప్పటి
పరుచుకునే జీవనానందం
నా ఈ తీరిక సమయాల్లో నుండి..
Thank God It's Friday!!
లేతకౌగిలి
మధ్యాహ్నం మూడు మూడున్నర మధ్యలో వీధిలోని అపార్ట్‌మెంట్‌లలో నుండి అమ్మలూ నాన్నలూ అమ్మమ్మలూ తాతయ్యలూ ఒక్కొక్కరుగా బయటకొస్తూ ఉంటారు. స్కూల్ బస్‌లు వచ్చే సమయం కదా- బయలుదేరిన వేళను బట్టి, కొందరు కంగారుగానూ, కొందరు నింపాదిగానూ నడుస్తూంటారు. ఇంకా బడికెళ్ళే వయసు రాని పిల్లలు మిగిలున్న అదృష్టమంతా ఇసుక గుట్టల మధ్య దొర్లించుకుంటూ ఉంటారు. ఆ వేళకి ఆఫీసు కాల్స్ ఏవో నడుస్తూ ఉంటాయి నాకు. ఈ రోజుకి మిగులున్న పనుల గురించీ, రేపటి పనుల గురించీ కూడా ఆఫీసు వాళ్ళతో ఆ టైంకి మాట్లాడటం ఒక అలవాటు. వీధి మలుపులో అందరూ ఎదురుచూపులతో నిలబడి ఉంటారు. నేనూ అలాగే..అందరిలాగే. ఆ చెట్ల కిందే ఎక్కడో ఓ చోటు చూసుకు బస్ కోసం చూస్తూ ఉంటాను.
పరవశ
My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book "ParavaSa" and it is out in the market now.
ఒక మామూలు సాయంత్రం
రోజూ పొద్దున అందరి స్నానాలూ అయ్యాక ఏదో ఒక టైం చూసుకుని వాషింగ్ మెషీన్ వెయ్యడమూ, పొద్దుటి మీటింగ్‌ల హడావుడి, పిల్లాడి లాగిన్ అయ్యాక ఓ పది నిమిషాలు దొరగ్గానే ఆ బట్టలన్నీ పైకి తీసుకెళ్ళి ఆరేయడం- నా దినచర్యలో భాగమైపోయింది. బాల్కనీల్లో ఆరేసే కన్నా పైన ఎండకి చప్పున ఆరతాయనిపిస్తుంది. కొరోనా మొదలయ్యాక, అసలు బయటకెళ్ళేందుకు మిగిలిన చిన్న చిన్న దారుల్లో ఇదొకటి కనుక, నేనే కాదు, అపార్ట్మెంట్‌లో అంతకు ముందు ఎన్నడూ కనపడనట్టున్న చాలా మంది ఇలాగే పైకి వచ్చి ఆరేయడం చూస్తున్నాను. సాయంత్రం నా టీ అయిపోగానే పిల్లాడిని అనిల్ కి అప్పజెప్పి మళ్ళీ పైకి వచ్చి ఆ ఫెళఫెళలాడే బట్టలు దులిపి మడతపెట్టడం నాకిష్టమైన వ్యాపకం. కాస్త అటూఇటూగా పొద్దున ఆరేసిన అందరం మళ్ళీ ఆవేళకే అక్కడికి చేరతాం. మాస్క్‌లు తీసేసిన నవ్వు ముఖాలు, అస్సలే ప్రత్యేకతా లేని రోజువారీ ముచ్చట్లు ఇప్పుడిప్పుడే దక్కుతోన్న స్నేహఫలాలు.
రాగసాధిక
ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...