"నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ..." ప్లేయర్లో బాలు గొంతు మెత్తగా వినపడుతోంది. ఊటీ ఘాట్ రోడ్ మీద కార్ మెలికలు తిరుగుతోంది.
బుజ్జాయి నా ఒళ్ళో నుండి దూకుతూ "నాన్నా..."అని డ్రైవింగ్ సీట్ వైపు దూకినప్పుడల్లా పట్టి ఆపాల్సి వస్తోంది.
"వద్దు నాన్నా..రోడ్ అస్సలు బాలేదు, మనం ఇంకా పైకి వెళ్ళాలి కదా..కార్ దిగాక నాన్నతో ఆడుకుందువు గాని..సరేనా?" లోపల ఉన్న భయం గొంతులో వినపడకుండా విశ్వప్రయత్నం చేస్తూ చెప్పాను.
వెనుక నుండి హరితా, రఘూ ఫక్కున నవ్వారు. "అంత భయమెందుకే, ఇప్పుడేమయిందనీ? అనిల్ అంత కూల్‌గా డ్రైవ్ చేస్తోంటే! వెధవభయలూ నువ్వూనూ" విసుక్కుంది హరిత.
"బయటచూడు, ఎంత బాగుందో! " అనిల్ మాట్లాడబోయాడు. చేత్తో తల తిప్పేసి "దారి చూడు ముందు!" కరుగ్గా చెప్పాను. నవ్వాడు.
నీలంపు పొడిని గుప్పిళ్ళతో జల్లినట్టు ఎంత బాగుంటాయో నీలగిరి పర్వతాలు. లోయలోకి జారిపడే సూర్యకాంతీ, వాలిపోయే ఆకులూ, కీచుమన్న శబ్దాలతో అకస్మాత్తుగా రెక్కలార్చుకుంటూ పైకి వచ్చే పక్షులూ - రెండు కళ్ళూ చాలనంత సౌందర్యం ఊటీది. ఎటు నుండో వినపడే జలపాతపు చప్పుళ్ళూ, కొండరాళ్ళపై ఎండిపోయిన సౌందర్యపు స్మృతులూ మనసుని నిలువనీయవు. ఏడు రంగుల ఇంద్రధనుస్సేదో ఒళ్ళో వచ్చి వాలినట్టు ఉంది, కార్ వెళుతోంటే. మోకాళ్ళ పర్వతం మీదకి ఎక్కలేక ఎక్కినట్టు, కార్ హెయిర్ పిన్ టర్న్స్ ని ఇబ్బందిగా దాటుతోంది. 24..25..26.. మలుపుమలుపుకీ ముప్పయ్యారు మీద ఆశే. సన్నని రోడ్లు, వానకు తడిసిన దారులూ, కవ్వించడానికన్నట్లు అకస్మాత్తుగా రోడ్ల మీదకు దూకే కోతులు..- ఎవ్వరేం చెప్పినా కొండవాలుని పట్టి ఊగుతోన్న పూల లతలా నా మనసులో భయం ఊగిసలాడుతూనే ఉంది.
"ఆ రోడ్డు చాలా ప్రమాదం! ఎన్ని ఆక్సిడెంట్స్ అవుతాయో తెలుసా అక్కడ! నేను మాత్రం డ్రైవ్ చెయ్యను" అని బయలుదేరే ముందు నా స్నేహితుల కుటుంబం చెప్పగానే గుండె ఆగిపోయింది. "అనిల్ డ్రైవ్ చేస్తా అంటేనే కదా కార్ తీశాం, లేదంటే ట్రావెల్స్ లో కనుక్కుంటే అయిపోయేది.." వాడిపోయిన నా మొహం చూసి అయోమయంగా అన్నారు వాళ్ళు. "అదేం లేదు.." పరధ్యానంగా చెప్పి కార్ ఎక్కాను. ఒళ్ళో బుజ్జాయిని చూసుకుంటే గుండె ఝల్లుమంటోంది. వాడికి ఏడాది వస్తోందనగా తిరుపతికి వెళ్ళొచ్చాక, మళ్ళీ బయటకు రావడం ఇదే మొదలు నాకు. ఏడాది మీద నాలుగు నెలలు. ఈ చీకట్లు ముసురుకుంటున్న కొండ దారిలో, అదీ ఊటీ కొండల మీద, మాకు మేమే డ్రైవ్ చేసుకుంటూ పిల్లాడితో వెళ్తున్నామని తెలిస్తే అమ్మా, అత్తగారు ఏమంటారో అసలు! ఏడో నెలలో పుట్టాడని రెప్ప వాల్చకుండా అందరూ అరచేతుల మీద పెంచుకొచ్చారు వీడిని. అతి జాగ్రత్త మంచిది కాదు కానీ, అజాగ్రత్త సంగతో?!
అమ్మ గుర్తొచ్చింది. నన్ను ఆపలేకా, తన మాటకు ఒప్పించలేకా ముఖం తిప్పుకున్న అమ్మ. ఎప్పుడూ ఏ అడ్వెంచరస్ ట్రిప్ కి వెళ్తున్నానన్నా ఒప్పుకునేది కాదు. వెయ్యి జాగ్రత్తలు, వెయ్యినొక్క ఒట్లు. "నీదంతా ఛాదస్తమమ్మా.." అని ఎలా కొట్టి పారేసేదాన్ని. వెనక్కి లాగకమ్మా అంటూ ఏం వేళాకోళాలాడేదాన్ని! ఇప్పుడేమైంది నాకు! ప్రతి ప్రేమను వెన్నాడుతూ ఒక బాధ్యత, భయం కూడా ఉంటాయనుకుంటాను. నా ప్రాణం సగాలుగా విడివడి బుజ్జాయినీ, వాడి నాన్ననీ అల్లుకుపోయిందని తెలుస్తోంది. సంబంధం లేని ఆలోచనలతో, భయాలతో నేను బయట సౌందర్యాన్ని నిండా అనుభవించకుండానే, కొండ పైకి చేరడం అయిపోయింది. చుట్టూ చీకట్లింకా దట్టంగా అలుముకుంటున్నాయి. రిసార్ట్ చేరగానే, కార్ కీస్ వాలెట్ పార్కింగ్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. బుజ్జాయి నాన్న మీదకి దూకాడు. రెండు కుటుంబాలకూ రెండు గదులు. రిసెప్షన్లో తాళాలిచ్చారు. పల్చటి సువాసనతో ఆహ్వానం పలుకుతున్న విశాలమైన గదిలోకి వచ్చిపడ్డాం. ఫాన్స్ ఉండని గదుల్లోని నిశబ్దం సేద తీరుస్తోంది.
"కోపం పోలేదా? సారీ!" భుజాలు పట్టి నన్ను తన వైపు తిప్పుకుంటూ అడిగాడు.
".."
"ఏం కాలేదుగా!"
"డ్రైవర్ ని పెట్టుకుంటే ఎంత మనశ్శాంతిగా ఉండేది! ఎంత ప్రమాదం! ఎంత జాగ్రత్త కావాలి. ఏమైనా అయ్యుంటే..బుజ్జిగాడు కూడా ఉన్నాడ్..."
"అందుకే నేనే డ్రైవ్ చేశాను" మధ్యలోనే నన్నాపేస్తూ చెప్పాడు. ముడుచుకున్న నా కనుబొమలను మునివేళ్ళతో సరిచేస్తూ అన్నాడు -"అంత ప్రమాదకరమైన రోడ్లలో, నిన్ను, వాడినీ, నా కన్నా జాగ్రత్తగా తీసుకు రాగలిగిందెవరు? ఊఁ?"
మంత్రం వేసినట్టే కోపమెటో పోయింది.
ఇద్దరి పెదాలనూ తాకుతూ ఒకే నవ్వు.

(తొలి ప్రచురణ : "మామ్స్‌ప్రెస్సో, తెలుగు ఎడిషన్‌లో)
ముగింపు దగ్గర అలా ఆగిపోయానండీ.. నేను మనసులో అనుకుంటున్నా జవాబే మీ హీరో నుంచి వచ్చేసరికి ఒకరకంగా jaw dropping moment అన్నమాట.. థాంక్యూ..
ReplyDeleteMurali Garu , :-) Happy to see you here, as always.
Delete