నిప్పులు

ముక్కాలిపీట మీద ముడుచుక్కూర్చుని
ఆరుబయట పెనం సిద్ధం చేస్తుందామె
చుక్కలు మెరిసే వేళకి
నిప్పులు రాజుకుంటాయి
సన్నని సెగలో కాలే కోర్కెల్ని దాస్తూ
ఎత్తుపళ్ళు దాచలేని నవ్వుల్తో
ఏవో ఆశల్ని పరుస్తాడతను.
రొట్టెలొత్తే చేతుల ఎర్రమట్టిగాజులు
గలగలలతో లయగా ఊకొడుతూంటాయి.
రగులుతూంటాయి నిప్పులు.
కండలు తిరిగిన మగడి దేహంలో
పగటి కష్టాన్ని పరికించి చూస్తూ
మునివేళ్ళతో అతని పెదవులకు
ప్రేమనంతా ముక్కలుగా అందిస్తుందామె
ఎంగిలిపడటం మొదలవుతుంది
ఆకలి పెరిగి పెద్దదవుతుంది
నిప్పులు పొగలు కక్కుతూంటాయి
గాలులు వేడెక్కిపోతాయి
నులకమంచం మీద మసకవెన్నెల
వెల్లికిల పడుకుని వేడుక చూస్తుంది
చిట్టిచేమంతులు మడుల్లో లేచి నిలబడి
కంటి చికిలింపుల్లో కథలు దాచుకుంటాయి
నడిరేయి ఏ ఝాముకో
చలిగాలులు వీస్తాయి.
కుంపట్లో నిప్పులు వాటంతటవే
ఆరిపోతాయి.
* తొలి ప్రచురణ - ఈమాట సెప్టెంబరు, 2014 సంచికలో.

13 comments:

  1. Replies
    1. :) Quite possible, కొత్తగా వ్రాయాలని ప్రయత్నించానంతే.
      అది సరే, మీరీ సారి నవ్వుతో సరిపెట్టకుండా ఓ మాట చెప్పారూ..అదింకా విచిత్రం :))).థాంక్యూ.

      Delete
  2. మరే రహ్మాన్ చేత పలికించిందంటేనే ఈ కవితలో ఏదో ఉన్నట్టే లెక్క.పెళ్ళికొడుకు అవబోతున్నాడు కదా మొరటుదనం తెలుస్తోందన్నమాట కొద్ది కొద్దిగా (వ్యాఖ్య బాలేదనిపిస్తే పబ్లిష్ చెయ్యకండి)

    ReplyDelete
  3. కవిత నిజంగానే కొత్తగా ప్రతీకాత్మకంగా గొప్పగా వుందమ్మా

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషమండీ...కవిసంగమంలో మీ వ్యాసాలు చదువుతూంటాను. మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.

      Delete
  4. పోస్టుకు :)
    కామెంట్లకు :) :)

    ReplyDelete
  5. ఎంత మాత్రం మొరటుగా లేదు. చాలా సరదాగా ఉంది.

    ReplyDelete
  6. ఎంత మాత్రం మొరటుగా లేదు. చాలా సరదాగా ఉంది.

    ReplyDelete
  7. పప్పు శ్రీనివాస్‌గారూ, నాగరాజ్ గారూ...ధన్యవాదాలు.

    ReplyDelete
  8. Chala Baga rastaru mam Miru chaduvutanu kani comments petadam marchipotanu inta goppa kavitalu nenu chavataniki chance ichinduku chala krutgnatalu

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...