ఒక్కోసారి ఒంటరిగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఎవరూ లేని బోగీలో, రగ్గుల్లో ముడుచుక్కూర్చుని, ఒక్కరమే, రాత్రంతా గడపాల్సి రావచ్చు.
చవితి చంద్రుణ్ణి చూస్తూ, నక్షత్రాలు లెక్కపెడుతూ, నీడల్లా వెనక్కు మళ్ళుతోన్న చెట్లను చూస్తూ, గంటలు కరిగించుకున్నా,
అంత తేలిగ్గా తెల్లవారకపోవచ్చు.
హాండ్బాగును సీటు క్రిందకు నిర్లక్ష్యంగా తోసి, వెంట తెచ్చుకున్న కవిత్వాన్ని మాత్రం గుండెలకు పొదువుకుని, నిన్ను నీకు దూరం చేసిన ఆ ఒకే ఒక్క కవితను- లేదా నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసిన ఆ ఒకే ఒక్క కవితను విప్పారిన కళ్ళతో మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ నిండుగా కప్పుకుంటూ..నువ్ నిద్రలోకి జారుకోవచ్చు.
తెల్లవారాక, నువ్వు కాఫీ కప్పు పట్టుకుని పేజీలు తిరగేసే వేళకి, పైబెర్తు నుండి క్రిందకు దిగిన మనిషి, "కవిత్వం ఇష్టమా తల్లీ?" అని చిరునవ్వుతో కబుర్లు మొదలెట్టినప్పుడు..మొదట ఒకింత ఆశ్చర్యంతోనూ, అటుపైన పట్టిచ్చిన పుస్తకం గుర్తొచ్చి ఒకింత సంతోషంగానూ, ఇంకాస్త హుషారుతోనూ,
నచ్చిన కవిత్వం గురించీ, నచ్చే కవుల గురించి, ఎప్పటిలాగే నువ్వు కబుర్లు చెప్పవచ్చు.
ఊ కొట్టాల్సిన మనిషి అకస్మాత్తుగా మాయమై, మాయమైనంత వేగంగానూ తిరిగి ప్రత్యక్షమై..."నచ్చే కవితో మాట్లాడి చూడు మరీ" అంటూ తన ఫోన్ నీ చెవికి అందించి నవ్వు మొహంతో చూస్తూన్నప్పుడు,
నువ్వే కవి పట్ల అభిమానమన్నావో,
ఎవరి కవిత్వం నీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుందన్నావో,
ఎవర్ని చదువుతూ లౌకికమైన బాధలకు ఎడంగా కొన్ని క్షణాలు నువ్వు బతకగలనన్నావో,
ఎవరు నీకో స్వాప్నిక జగత్తును పరిచయం చేసారని మురిశావో..
ఆ కవి గొంతు వినపడి, నీ జవాబు కోసం ఆగి ఉన్నప్పుడు,
ఆ అకస్మాత్తు అనుభవం నీ వేయిన్నొక్క మాటలనూ నిశ్శబ్దంలోకి తోసి,
నీ ఉద్వేగాగలన్నింటినీ మౌనంలో తొక్కి పెట్టి..
ఏమో, అభిమానాన్ని కవికి చేరవేయనూ వచ్చు,
చేరవేయలేక ఓడిపోనూ వచ్చు,
పర్లేదు, మాటలకందని తృప్తి ఒకటి వీటన్నింటికీ అతీతమైనదన్న ఎరుక నీలో కలగనూ వచ్చు.— feeling wonderful.

Gr8 to know..! S..it's really wonderful. .congrats:)
ReplyDelete:)))) థాంక్యూ థాంక్యూ!!
Delete"ఇంతకన్నా ఆనందమేమీ మనసా..." :-)
Manasa gaaru..really superb:):):)
ReplyDeleteemmataloa mee raasina kavitha chalaa chaala baagundi:):)
థాంక్యూ కార్తిక్ :)
Deletewow! simply superb! ఇంత అందంగా
ReplyDelete:)) Thank you Chamarthi girl. :).. Wonder if we had met before or some distant relatives. :O
Deletevery nice madam
ReplyDelete