.తొలి ప్రచురణ - పాలపిట్ట సాహిత్య మాస పత్రిక, జనవరి- 2014 సంచికలో
తరగల నులివెచ్చని ముద్దుల్లో
తడారని పాదాల నురుగల నవ్వులను
పెదాల మీద మెరుపుల్లా అంటించుకుంటాడతను.
భుజం మీద వాలి దిగంతాల్లోకి చూస్తూ
ఆకాశం సముద్రంతో సరసాలాడడాన్ని
కళ్ళతో జుర్రుకుంటుందామె.
తడిపొడులు శరీరాలతో దోబూచులాడుతుంటాయి
వెలుగు నీడలు కళ్ళల్లో వచ్చిపోతూంటాయి
గుప్పెడు ఇసుకను వేళ్ళ సందుల్లోంచీ వదిలేస్తూ
గుండెల్లోని ఊసులన్నీ ఇచ్చిపుచ్చుకుంటారు.
సంధ్య హారతి ముగిసేవేళకి అతని ప్రేమంతా
మహానైవేద్యమై ఆమె పాదాల ముందు మోకరిల్లుతుంది
ఆమె చొరవ చీర చూపించే కొంగొత్త అందమంతా
మహోజ్వలమై అతని హృదయాన్ని వెలిగిస్తుంది.
చీకటి విప్పిన వెలుగుల మూటలు
చూడలేని వాళ్ళంతా వాదించుకుంటారు,
ఆకాశమూ అర్ణవమూ
ఏనాటికైనా ఎలా కలుస్తాయని.
మీ ఏ కవితా మరో రెండు సార్లు చదివించకుండా పంపించదు. కవిత్వమంటే ఆమడదూరం పారిపోయే వాళ్ళకు మీ కవితలు వినిపించాలనిపిస్తుంది మానసా.
ReplyDeleteఎంత బావుంది కవిత ! వసంత వేళ
ReplyDeleteసాహితీ వనం పూచి , వాసనలు పుడమి
నెల్లెడల గుభాళించి , పన్నీటి జల్లు
చల్లి సేద తీర్చిన యట్లు చదువరులకు .
----- సుజన-సృజన
జ్యోతిర్మయిగారూ, వెంకట రాజారావుగారూ, హృదయపూర్వక ధన్యవాదాలు.
ReplyDeleteషరా మాములే..అద్భుతం
ReplyDelete:) Thank you so very much.
DeleteReally superb superb superb:-):-)
ReplyDeleteKarthik, Thank you.
Deleteokatiki rendu sarlu chadivitheygani ardam kadu. Okkasari ardamayyaka inka aa bhaavam malli vadaladu
ReplyDeletechaala chaala bagumdi. our best wishes and blessings.
ReplyDeleteWow .. annayyaa, thank you so much :). Happy to see you here. :D
Delete