శ్రావణ రాత్రులు

శ్రావణ రాత్రులు నిద్రపోనివ్వవు

అకస్మాత్తుగా అవనిని ముద్దాడే వాన చినుకులూ
పుష్పాభిషేకాలతో పుడమి క్రొంగొత్త పులకింతలూ
గూటిలో ఒదిగిన గువ్వల వలపు కువకువలూ..
శ్రావణ రాత్రుల్లో కన్నులు మూతపడవు!

కొద్దికొద్దిగా గిల్లుతూ చలి ముల్లు
కాస్త కాస్తగా తడిపే తుంటరి జల్లూ
రేయంతా రెక్కలు తెరుచుకునే ఉండాలిక
అద్దాల మేడ మొత్తం మసకబారిపోయేదాకా

దీపాలారే వేళల్లో లయగా ఈ నేపథ్య సంగీతం
ఏనాటిదో ఓ పురాస్మృతిగీతాన్ని జ్ఞప్తికి తెస్తూ
మన్ను పరిమళంలా మెల్లగా లోలో సుళ్ళు తిరుగుతూ
ఆషాఢ రాత్రుల విరహానికి వీడ్కోలవుతోంటే

లేలేత నడుమును చుడుతూ పెనవేసుకునే బంధాలు
అనాచ్ఛాదిత గుండెలను చుంబించే నెన్నుదిటి ముంగురులూ
కొనగోటి స్పర్శల్లో ఏ స్వప్న లిపి ఆవిష్కృతమవుతుందో గానీ..
మెరుపులేమో నీలి కన్నుల్లో..వెలుగులన్నీ దహరాకాశంలో

శ్రావణ రాతురులు...లోకాలను నిదుర పోనివ్వవు...!!



** Thanks to N.S.Murthy Garu, You can now find the English translation to this poem at : http://teluguanuvaadaalu.wordpress.com/2013/09/25/the-monsoon-nights-manasa-chamarti-telugu-indian/

28 comments:

  1. Replies
    1. manasa garu,,mee saahityam bagundhi..nenu me junior andi..bagunnara

      Delete

  2. "మెరుపులేమో నీలి కన్నుల్లో..వెలుగులన్నీ దహరాకాశంలో"

    చాలా బావుంది!!

    వెల్కమ్ బ్యాక్ :-)

    ReplyDelete
  3. బాగున్నది. :)

    On a lighter note, మొదటి లైన్ చదివి నైట్‌షిఫ్ట్‌లు చేస్తున్నారేమో, పగలు పడుకోలేకపోయారా అనుకున్నాను.

    ReplyDelete
    Replies
    1. Glad you liked it.
      ---@night shifts -- boy , you are impossible

      Delete
  4. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మానసగారూ :) బాగుంది శ్రావణరాత్రి. దహరాకాశమంటే ఏంటండీ అర్ధం.కొత్తగా వింటున్నాను? మొదట టైపు మిస్టేకేమో అనుకున్నా. కాకపోతే రాసింది మీరాయే.కామెంటులో నిషిగారూ అదే బాగుందన్నారు కదా. అప్పటికి గానీ నా అజ్ఞానమే అని అర్దం కాలేదు :)

    ReplyDelete
    Replies
    1. Kranthi Garu, Very happy to see your response. Thanks a lot for your messages :-)
      daharamu == hrdayamu :)

      (Sorry - I am currently having some problem typing Telugu). nenu mallee mail chestaanu meeku.

      Delete
  5. >>కొనగోటి స్పర్శల్లో ఏ స్వప్న లిపి ఆవిష్కృతమవుతుందో గానీ..
    మెరుపులేమో నీలి కన్నుల్లో..వెలుగులన్నీ దహరాకాశంలో>>

    నీలి మేఘంపై తేలిపోతూ ఏవో లోకాలకు వెళ్తున్నట్లుగా వుంటుంది మీ కవిత్వం చదువుతుంటే..

    ReplyDelete
  6. బావుందండి.దహరము అనే కొత్త మాట తెలుసుకున్నాను

    ReplyDelete
  7. మానసగారు,

    Welcome back!! :-)

    మీ కవితలు చదువుతుంటే కవిత్వంపై అంతగా ఆసక్తిలేని నాలాంటి వాళ్ళకి కూడా కవిత్వంపై మక్కువ పెరుగుతుంది. చిన్నప్పుడు అనుభవించి కాలక్రమంలో మర్చిపోయిన తెలుగుభాషలోని తియ్యనిదనంపైన కూడా! :-)

    --శ్రీనివాస్

    ReplyDelete
    Replies
    1. Thank you so much! :)
      మీరు లేఖిని వాడటంలో సిద్ధహస్తులైపోయారు. :). మీరు తెలుగు మర్చిపోయిన దాఖలాలేవీ నాకు కనపడ్డం లేదసలు. :p

      Delete
  8. వాస్తవాన్ని వయ్యారాన్ని అందంగా తీర్చిదిద్దారు .... అభినందనలు..

    ReplyDelete
  9. కొన్ని కవితలు చదవకుండా తప్పుంచుకోనియ్యవు శారద రాత్రుల్లాగే

    ReplyDelete
  10. అద్భుతః ....:)))))

    ReplyDelete
  11. Maa amma chese vankaya pachadi antha adbhutam ga undi nee kavitvam.
    Nee kavitvanni pachadi tho polchanani benga padaku !!!!!

    ReplyDelete
    Replies
    1. కమలక్క చేతి వంకాయ పచ్చడికి నేను కూడా వీరాభిమానిని + దాని కోసం నువ్వు అలగడాన్ని ఇప్పటికీ అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు కాబట్టీ...:)) - I take it as a compliment ;))

      Delete
  12. <>

    స్పందించే హృదయమంటూ మనకుంటే, బాధగా మూలిగే భాషొకటి మనలోపలెక్కడో ఉంటే ఏ రాత్రి మాత్రం నిద్రపోనిస్తుంది?

    ReplyDelete
  13. శ్రావణమేఘాలలోని చల్లదనాల పలకరింతలు శ్రావణరాత్రులను చేరితే మరింక నిదుర రమ్మంటేమాత్రం యెలా వస్తుంది?
    కవిత చాలాబాగుందండీ...

    ReplyDelete
  14. జ్యోతిర్మయి గారూ, లోకేష్ శ్రీకాంత్ గారూ, సాగర్ గారూ, పప్పు శ్రీనివాస్ గారూ, సాహితీ, మురళీ, శ్రీలలిత గారూ - అందరికీ నెనర్లు :).

    ReplyDelete
  15. చాలా కాలానికి మళ్ళీ మీ నుండి ఓ కవిత. అనుభూతీ, వ్యక్తీకరణా ఆహ్లాదకరంగా ఉన్నాయి. తరువాతి కవిత ఎప్పుడు? :)

    ReplyDelete
    Replies
    1. Thank you so much, sir!
      Another poem..mm.. Hopefully soon..:-) :-)

      Delete
  16. చాలా రోజుల తరువాత మీ బ్లాగ్ ను పలకరిస్తే ఇంత మంచి పోస్ట్ ఎదురయింది. Beautiful :)

    ReplyDelete
    Replies
    1. Thank you, Nagarjuna. It is always a pleasure to hear from you. :-)

      Delete
  17. Super manasa gaaru... Intha manoharamgaa elaa rastarandee meeru:-):-):-)

    ReplyDelete
    Replies
    1. :-) :-) thank you kartik, for all your kind words.

      Delete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...