"50 .."
లోలోపల ఎగసిపడుతున్న సంతోషపు తరంగాలని ఆపుతున్న ఒక సందేహం..
"70 "
చేతిలో ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా పక్కన పెడుతూ..
"80 "
ఒక్కొక్కరుగా లేచి హాల్లోకీ, వంటింట్లోకి కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతూ..
"95.."
హాల్లో టి.వి ముందు ఎవ్వరూ ఉండరు. ఇల్లు ఖాళీ..మనుషులెక్కడో బాల్కనీల్లో చీకట్లో నిలబడి కనపడని చుక్కలు లెక్కపెట్టుకుంటూ..సెకను సెకనుకీ మరింత స్పష్టంగా వినపడుతున్న గుండెను బుజ్జగిస్తూ...
ఆ నిశ్శబ్దంలో నుండి..కింద ఇళ్ళల్లో అకస్మాత్తుగా ఒక కోలాహలం, అరుపులు, కేకలు వినపడేవి. అంతే! అందాకా సంశయంతో ఆగిపోయిన చేతులు కలిసి చప్పట్లతో ఇంటిని హోరెత్తించేవి ! క్షణాల్లో మళ్ళీ హాలు నిండిపోయేది. ఆ కాసేపూ మనుష్యులు లోకాలు మర్చిపోయేవారు. కోపాలు మర్చిపోయేవారు. జీవితాల్లోని అసంతృప్తులు మర్చిపోయేవారు.
హెల్మెట్ తీసి, బరువైన బ్యాట్‌ను ఆకాశం కేసి చూపిస్తూ వినమ్రంగా తల వచి, కుడి భుజంతో నుదురు తుడుచుకుని మళ్ళీ అతడు క్రీజ్‌లోకి వెళ్ళడం...
ఆ క్షణాలు ఎంత అనిర్వచనీయమైనవో చెప్పడానికి నాకు భాష సరిపోదు.
మళ్ళీ ఎప్పుడు ?
పెద్దమ్మ వాళ్ళింట్లో ఇంతకు మునుపెన్నడూ చూడని ఓ పెద్ద టి.విలో ఆట చూసేందుకు అందరూ కన్నార్పకుండా కూర్చున్నప్పుడు. అరగంట సేపు పుస్తకం వదిలితే వీపు చీరేస్తానని బెదిరించే పెద్దమ్మ, నలుగురు స్నేహితులతో అన్నయ్యలు అన్నేసి గంటలు ఆపకుండా క్రికెట్ చూస్తున్నా ఏమీ అనకుండా వదిలేసినప్పుడు.
వాళ్ళు ఆట అర్థం చేసుకోవడం నేర్పించారు. నేను ఒక నా ప్రపంచంలో మొట్టమొదటి హీరోని తొలిసారి ఆ టి.వి.లో చూసుకున్నాను.
షార్జా, కలకత్తా, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాదు -
ఊపిరి బిగపెట్టి అతనున్నంతసేపూ చూసేవాళ్ళమంటే అతిశయోక్తి కాదు. అజారుద్దీన్, గంగూలీ, జడేజా - ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతుంటే ఇతడొక్కడూ ఆడుతూ ఉండేవాడు. ఆడి గెలిపించేవాడు. ఎవ్వరికీ ఎప్పుడూ అడ్డనిపించని ఆ నల్ల స్క్రీన్ అతన్నెందుకు ఇబ్బంది పెట్టేదో అర్థమయ్యేది కాదు. అక్కడికి ఎవరన్న వచ్చినా కదిలినట్లనిపించినా చేతులూపుతూ అతను చెప్పేవన్నీ ఆసక్తిగా చూసేవాళ్ళం. ఈనాడు స్పోర్ట్స్ పేజీ వాడు, అప్పట్లో "రాణించిన రాహుల్- గుబాళించిన సౌరవ్", "షార్జాలో పరుగుల వరద", " కలల్లోనూ వెన్నాడుతున్న సచిన్ - వార్న్" అంటూ మహా మహా క్రియేటివ్ పేర్లన్నీ పెడుతూ మంచి వ్యాసాలు వ్రాసేవాడు. ఒక్కొక్క అక్షరం ఎన్ని వేల మందిని ఉత్తేజితులను చేసి ఉంటుందో నా ఊహకు కూడా అందదు.
అతడిలో ఎప్పుడూ గంగూలీలో కనపడ్డ ఆవేశం కనపడేది కాదు. అలా అని అతను అజయ్ జడేజాలా మిస్టర్ కూల్‌లానూ ఉండేవాడు కాదు. అతను వస్తూంటేనే ఆట మీద అతనికున్న ప్రేమ చూసేవాళ్ళందరికీ పంచి పెడుతున్నాడా అనిపించేది. ఆ కళ్ళల్లో క్రికెట్ అంటే తపన - వందలు నూటాభైలు కొట్టేశాకా కూడా " I am still not tired. I still want to play" అంటే నవ్విన వాళ్ళు ఎందరున్నా, కళ్ళు తడి చేసుకున్న వాళ్ళు అందరే ఉన్నారు. అందులో నేనొకదాన్ని.
డే-నైట్ మ్యాచులు పరీక్షల ముందొస్తే చూడకుండా ఉండలేకపోయేవాళ్ళం. అతను సెంచరీ కొడితే ఆ ఉత్సాహంలో విరగబడి చదివేవాళ్ళం. ఆడకపోతే తలెత్తకుండా "Dressing room" వైపు వెళ్ళిపోయిన సచిన్‌ను తల్చుకుని మరింత బాధగా చదివేవాళ్ళం. " presentations" దగ్గర తను చెప్పే నాలుగు మాటల కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని వినేవాళ్ళం. "మాన్ ఆఫ్ ద మాచ్" మళ్ళీ మళ్ళీ మళ్ళీ అతనే అవుతుంటే మహదానందంతో పొంగిపోయేవాళ్ళం. ఆ సంతోషానికి ఏమిచ్చినా బదులు తీర్చుకోలేం.
అవినీతి కుంభకోణం అనధికార జాతీయ క్రీడకూ పాకిందని తెల్సినప్పుడు, అజారుద్దీన్ లాంటి విజయవంతమైన కెప్టెన్లూ, జడేజా లాంటి సిల్వర్ స్పూన్ పట్టుకు పుట్టిన వాళ్ళూ అందులో ఉన్నారని ఆరోపణలు వచ్చినప్పుడు, సచిన్ అభిమానిగా నేనూ భయంభయంగా వార్తలు చదువుకున్న రోజులు ఉన్నాయి. కానీ అతడెప్పుడూ మా నమ్మకాన్ని బద్దలు కొట్టలేదు. ఇన్నేళ్ళ క్రీడా జీవితంలో, ఇన్ని కోట్ల కళ్ళ ముందు అనుక్షణం మెదులుతూ కూడా ఎప్పుడూ ఎప్పుడూ ఏ చిన్న మరకా తన జీవితం మీద పడకుండా చూసుకున్నాడు.
"పొడుగ్గా ఉండడు కదా", " గొంతు చూడు ఏదోగా ఉండదూ" " అసలు బయట పార్టీల్లో కూడా గొప్పగా కనపడదు" అని తోటి వాళ్ళు ఎవరైనా అతని గురించి అనేస్తే - వెర్రి కోపమే వచ్చేది నాకు. బదులివ్వడం రాదు- అప్పటికీ ఇప్పటికీనూ. అవును- అతనిలో ఆకర్షించేది ఆట పట్ల అతనికున్న ప్రేమ, క్రికెట్ గురించి మాట్లడిన ప్రతిసారీ అతని కళ్ళల్లో కనపడే మెరుపు, ఎన్ని వేల పరుగులు సాధించినా నడవడికలో మచ్చుకైనా కనపడని గర్వం - ఎవ్వరికైనా కేవలం ప్రతిభతోనే సమాధానం చెప్పగల అతని గొప్పతనం - ఇరవై మూడేళ్ళ పాటు ఒక జాతికి గర్వకారణంగా అతను మసలుకున్న తీరు అని చెబితే, క్రీడాకారుల్లోనూ, కళాకారుల్లోనూ శారీరక సౌందర్యం వెతుక్కునే అల్పమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళకు అర్థమవుతుందన్న ఆశ నాకు లేదు.
------------
సచిన్‌ను తల్చుకోవడం అంటే నాకేమిటో తెలుసా..టైం మెషీన్‌ను ఎక్కడం. అవును..నేను ఏడో తరగతిలో ఉండగా అనుకుంటా మొదలైందీ ఇష్టం - ఇప్పుడు నా చదువైపోయి ఉద్యోగంలో చేరి కూడా ఏడేళ్ళు దాటిపోయింది. అయినా సరే...
ఏడెనిమిది తరగతుల్లో సీజన్స్ గ్రీటింగ్ కార్డ్స్ కాకుండా అర్థరూపాయి పెట్టి సచిన్ కాగితం బొమ్మ కొని, వెనుక "హ్యాపీ న్యూ ఈర్ మానసా" అని రాసిచ్చిన నేస్తాలు; తొమ్మిదీ పదుల్లో అక్కతోనూ, బళ్ళో తోటి వాళ్ళతోనూ పోటీలు పడుతూ ఈనాడు క్రీడా విభాగపు పేజీ మొత్తాన్నీ ముక్కలు ముక్కలుగా చించి ఆల్బం చేసుకోవడాలూ; కొత్త ఫొటో వచ్చిందని ఎవరో చెబితే ఎన్నడూ లేనిది "వార్త" న్యూస్పేపర్ కొనడమూ; ఆర్చీస్‌లో, హాల్స్మార్క్స్‌లో నిలువెత్తు సచిన్ పోస్టర్‌లు చూసి నోరెళ్ళబెట్టడమూ; రెండొందల పరుగులు చేసిన రోజున ఆఫీసులో సంబరాలు; ప్రొడక్షన్ వదిలేశామని తెలిసీ ఏమీ అనని మేనేజర్ మీద తొలిసారి ఓ కొత్త రకం అభిమానం పుట్టుకురావడం; ఇండో-పాక్ మాచ్లు ఆఫీసు ఓపెన్ థియేటర్‌లో అంత మంది సహోద్యోగుల అరుపుల మధ్య చూడడం; 175 పరుగులు చేశాకా జట్టు ఓడిపోతే - దానికి కూడా సచిన్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసినప్పుడు ఏడవలేక నవ్వడం; "గంగూలీ సందులో గజ్జెల గోల" అని వేటూరి రాసేడని టెండూల్కర్ గురించి ఎప్పుడూ వినని "ఆడి చూడు క్రికెట్టూ టెండూలర్ అయ్యేటట్టు.." పాట నేర్చుకోవడం -- ఎన్నని వ్రాయను? జీవితపు ప్రతి మలుపులోనూ పక్కనే ఉన్నట్టనిపించే మనిషి గురించి - మన వాడనిపించే - ఈ క్రీడాకారుని గురించి, అతనితో పెనవేసుకున్న నా అనుభవాల గురించి...ఇంకెన్ని వ్రాయను ?
అందుకే అతనొట్టి ఆటగాడంటే నాకొప్పుకోబుద్ధి కాదు. కొన్ని వేల జీవితాలపై చెరగని సంతకం- సచిన్!
స్కూల్ జీవితం, ఇంటర్మీడియట్టూ, మొత్తం నా డైరీలన్నీ అతని రికార్డులతో నిండి ఉండేవి. రెండు మ్యాచుల్లో అతను యాభై పరుగులైనా చేసి ఉండకపోతే, మూడో మాచ్లో ప్రత్యర్థిని తల్చుకుని నవ్వుతూ నే చేసిన ఊహాగానాలన్నీ నిజం చేసి చూపించేవాడు సచిన్. నా పుస్తకాల బీరువా లోపలి వైపు ఇన్నేళ్ళలోనూ నేను అతికించుకున్న ఒకే ఒక్క ఫొటో సచిన్‌ది. మరొకరి కలను నా కలగా అనుభవించానూ అంటే అది అతనిది. ఒక ఆట - ఇరవైరెండు మంది ఆడే ఆట అంత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటుందని నాకు నేర్పింది సచిన్. అందుకే, చాలా లక్షల కోట్ల మందికి మల్లే, " Sachin is the God of cricket" అని నేను అనను. ఎందుకంటే నాకు క్రికెట్ , సచిన్ వేరు కాదు. క్రికెట్ అంటేనే సచిన్!!
ఇంతా చేసి నేనెప్పుడూ అతను సెంచురీ చేయగా చూడలేదు. (టి.వి లో కూడా). ప్రతీ సారీ మా అక్క బాల్కనీలో చీకట్లో చేతులు నులుముకుంటూ కూర్చున్న నన్ను లాకెళ్ళి చూపిస్తే చూడడమే. 98 పరుగుల నుండి టి.వి ముందు కూర్చునే సహనం లేకపోయేది.
రెండవ లోటు - జట్టు సగర్వంగా ప్రపంచ కప్ పట్టుకున్న క్షణాల్లో నేను బెల్జియం నుండి తిరిగి వస్తున్నాను. జెట్ ఏర్వేస్ వాడు పావుగంటకొకసారి స్కోర్ చెప్పి, చాక్లెట్లిచ్చి మమ్మల్ని చిరఋణగ్రస్తులను చేసేశాడు. బెంగళూరుకు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో నేను ముంబైలో దిగి, రావలసి వచ్చింది. అక్కడ దిగగానే లగేజీలు కూడా వదిలేసి సగం మంది టి.విల ముందుకు పరుగులెత్తాం. మొహాల నిండా త్రివర్ణాలతో ఎంత మంది ఎదురొచ్చి అభినందనలు తెలిపారో, ఎంత మంది స్వీట్‌లు ఇస్తూ తిరిగారో లెక్కే లేదు. ఆ రోజు ముంబైలో దీపావళి జరిగిందా అని ఆశ్చర్యపోయిన వాళ్ళదీ తప్పేం కాదు. బెంగళూరు ఫ్లైట్ ఆఖరు క్షణాల్లో అందుకుని, నా పక్కన కూర్చున్న ఇరవయ్యేళ్ళ అబ్బాయి " నేనతన్ని చూశాను" అని ఉద్వేగంగా చెప్పినప్పుడు, నాలో అసూయను తొక్కిపెట్టి సంతోషం ఎగసిపడటం ప్రపంచ కప్‌ను ముద్దాడాలన్న సచిన్ పాతికేళ్ళ కలల సాక్షిగా నిజ్జం.
------
ఈ ఒక్క పోస్ట్‌కీ కామెంట్స్ డిసేబుల్ చేశాను. ఇది క్రికెట్‌కు సచిన్ నిజంగా సేవ చేశాడా లేదా, అతని రికార్డులు దేశానికి పనికొచ్చాయా లేదా , అతను నిస్సందేహంగా గొప్ప బాట్స్‌మన్ అవునా కాదా అన్న అంశాల మీద సాధికారంగా చర్చలు చేయాలని భావిస్తున్న అనేకానేక ఔత్సాహిక విమర్శకులకు వేదిక కావడం పట్ల ఆసక్తి లేక. అలాగే సచిన్ నిజంగా ఇందరి అభిమానానికి అర్హుడా కాడా అన్న విషయం మీద కూడా కొందరు ఉచితంగా చేయబోతున్న జ్ఞానబోధలు స్వీకరించగల స్థితిలో లేక.
---
Dear Sachin - You are the pride of this nation and you have inspired millions of this country in one way or the other. We love you!

****************
పరీక్షలకు తీసుకెళ్ళే అట్టలను బాట్‌లగానూ, పచ్చి జాంపళ్ళను బాల్స్‌గానూ, కనపడిన ప్రతి గోడ మీదా బొగ్గు ముక్కతో నిలువు నామాలు దిద్ది, వాటిని వికెట్లుగా నమ్మి క్రికెట్ ఆడుకున్న పసితనం నాలోనూ కొంత ఉంది. కాలంతో పాటే అదీ చేజారిపోయింది.మళ్ళీ ఎప్పుడు ?
పెద్దమ్మ వాళ్ళింట్లో ఇంతకు మునుపెన్నడూ చూడని ఓ పెద్ద టి.విలో ఆట చూసేందుకు అందరూ కన్నార్పకుండా కూర్చున్నప్పుడు. అరగంట సేపు పుస్తకం వదిలితే వీపు చీరేస్తానని బెదిరించే పెద్దమ్మ, నలుగురు స్నేహితులతో అన్నయ్యలు అన్నేసి గంటలు ఆపకుండా క్రికెట్ చూస్తున్నా ఏమీ అనకుండా వదిలేసినప్పుడు.
వాళ్ళు ఆట అర్థం చేసుకోవడం నేర్పించారు. నేను ఒక నా ప్రపంచంలో మొట్టమొదటి హీరోని తొలిసారి ఆ టి.వి.లో చూసుకున్నాను.
*********************
షార్జా, కలకత్తా, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాదు -
ఊపిరి బిగపెట్టి అతనున్నంతసేపూ చూసేవాళ్ళమంటే అతిశయోక్తి కాదు. అజారుద్దీన్, గంగూలీ, జడేజా - ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతుంటే ఇతడొక్కడూ ఆడుతూ ఉండేవాడు. ఆడి గెలిపించేవాడు. ఎవ్వరికీ ఎప్పుడూ అడ్డనిపించని ఆ నల్ల స్క్రీన్ అతన్నెందుకు ఇబ్బంది పెట్టేదో అర్థమయ్యేది కాదు. అక్కడికి ఎవరన్న వచ్చినా కదిలినట్లనిపించినా చేతులూపుతూ అతను చెప్పేవన్నీ ఆసక్తిగా చూసేవాళ్ళం. ఈనాడు స్పోర్ట్స్ పేజీ వాడు, అప్పట్లో "రాణించిన రాహుల్- గుబాళించిన సౌరవ్", "షార్జాలో పరుగుల వరద", " కలల్లోనూ వెన్నాడుతున్న సచిన్ - వార్న్" అంటూ మహా మహా క్రియేటివ్ పేర్లన్నీ పెడుతూ మంచి వ్యాసాలు వ్రాసేవాడు. ఒక్కొక్క అక్షరం ఎన్ని వేల మందిని ఉత్తేజితులను చేసి ఉంటుందో నా ఊహకు కూడా అందదు.
అతడిలో ఎప్పుడూ గంగూలీలో కనపడ్డ ఆవేశం కనపడేది కాదు. అలా అని అతను అజయ్ జడేజాలా మిస్టర్ కూల్‌లానూ ఉండేవాడు కాదు. అతను వస్తూంటేనే ఆట మీద అతనికున్న ప్రేమ చూసేవాళ్ళందరికీ పంచి పెడుతున్నాడా అనిపించేది. ఆ కళ్ళల్లో క్రికెట్ అంటే తపన - వందలు నూటాభైలు కొట్టేశాకా కూడా " I am still not tired. I still want to play" అంటే నవ్విన వాళ్ళు ఎందరున్నా, కళ్ళు తడి చేసుకున్న వాళ్ళు అందరే ఉన్నారు. అందులో నేనొకదాన్ని.
డే-నైట్ మ్యాచులు పరీక్షల ముందొస్తే చూడకుండా ఉండలేకపోయేవాళ్ళం. అతను సెంచరీ కొడితే ఆ ఉత్సాహంలో విరగబడి చదివేవాళ్ళం. ఆడకపోతే తలెత్తకుండా "Dressing room" వైపు వెళ్ళిపోయిన సచిన్‌ను తల్చుకుని మరింత బాధగా చదివేవాళ్ళం. " presentations" దగ్గర తను చెప్పే నాలుగు మాటల కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని వినేవాళ్ళం. "మాన్ ఆఫ్ ద మాచ్" మళ్ళీ మళ్ళీ మళ్ళీ అతనే అవుతుంటే మహదానందంతో పొంగిపోయేవాళ్ళం. ఆ సంతోషానికి ఏమిచ్చినా బదులు తీర్చుకోలేం.
---
అవినీతి కుంభకోణం అనధికార జాతీయ క్రీడకూ పాకిందని తెల్సినప్పుడు, అజారుద్దీన్ లాంటి విజయవంతమైన కెప్టెన్లూ, జడేజా లాంటి సిల్వర్ స్పూన్ పట్టుకు పుట్టిన వాళ్ళూ అందులో ఉన్నారని ఆరోపణలు వచ్చినప్పుడు, సచిన్ అభిమానిగా నేనూ భయంభయంగా వార్తలు చదువుకున్న రోజులు ఉన్నాయి. కానీ అతడెప్పుడూ మా నమ్మకాన్ని బద్దలు కొట్టలేదు. ఇన్నేళ్ళ క్రీడా జీవితంలో, ఇన్ని కోట్ల కళ్ళ ముందు అనుక్షణం మెదులుతూ కూడా ఎప్పుడూ ఎప్పుడూ ఏ చిన్న మరకా తన జీవితం మీద పడకుండా చూసుకున్నాడు.
"పొడుగ్గా ఉండడు కదా", " గొంతు చూడు ఏదోగా ఉండదూ" " అసలు బయట పార్టీల్లో కూడా గొప్పగా కనపడదు" అని తోటి వాళ్ళు ఎవరైనా అతని గురించి అనేస్తే - వెర్రి కోపమే వచ్చేది నాకు. బదులివ్వడం రాదు- అప్పటికీ ఇప్పటికీనూ. అవును- అతనిలో ఆకర్షించేది ఆట పట్ల అతనికున్న ప్రేమ, క్రికెట్ గురించి మాట్లడిన ప్రతిసారీ అతని కళ్ళల్లో కనపడే మెరుపు, ఎన్ని వేల పరుగులు సాధించినా నడవడికలో మచ్చుకైనా కనపడని గర్వం - ఎవ్వరికైనా కేవలం ప్రతిభతోనే సమాధానం చెప్పగల అతని గొప్పతనం - ఇరవై మూడేళ్ళ పాటు ఒక జాతికి గర్వకారణంగా అతను మసలుకున్న తీరు అని చెబితే, క్రీడాకారుల్లోనూ, కళాకారుల్లోనూ శారీరక సౌందర్యం వెతుక్కునే అల్పమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళకు అర్థమవుతుందన్న ఆశ నాకు లేదు.
------------
సచిన్‌ను తల్చుకోవడం అంటే నాకేమిటో తెలుసా..టైం మెషీన్‌ను ఎక్కడం. అవును..నేను ఏడో తరగతిలో ఉండగా అనుకుంటా మొదలైందీ ఇష్టం - ఇప్పుడు నా చదువైపోయి ఉద్యోగంలో చేరి కూడా ఏడేళ్ళు దాటిపోయింది. అయినా సరే...
ఏడెనిమిది తరగతుల్లో సీజన్స్ గ్రీటింగ్ కార్డ్స్ కాకుండా అర్థరూపాయి పెట్టి సచిన్ కాగితం బొమ్మ కొని, వెనుక "హ్యాపీ న్యూ ఈర్ మానసా" అని రాసిచ్చిన నేస్తాలు; తొమ్మిదీ పదుల్లో అక్కతోనూ, బళ్ళో తోటి వాళ్ళతోనూ పోటీలు పడుతూ ఈనాడు క్రీడా విభాగపు పేజీ మొత్తాన్నీ ముక్కలు ముక్కలుగా చించి ఆల్బం చేసుకోవడాలూ; కొత్త ఫొటో వచ్చిందని ఎవరో చెబితే ఎన్నడూ లేనిది "వార్త" న్యూస్పేపర్ కొనడమూ; ఆర్చీస్‌లో, హాల్స్మార్క్స్‌లో నిలువెత్తు సచిన్ పోస్టర్‌లు చూసి నోరెళ్ళబెట్టడమూ; రెండొందల పరుగులు చేసిన రోజున ఆఫీసులో సంబరాలు; ప్రొడక్షన్ వదిలేశామని తెలిసీ ఏమీ అనని మేనేజర్ మీద తొలిసారి ఓ కొత్త రకం అభిమానం పుట్టుకురావడం; ఇండో-పాక్ మాచ్లు ఆఫీసు ఓపెన్ థియేటర్‌లో అంత మంది సహోద్యోగుల అరుపుల మధ్య చూడడం; 175 పరుగులు చేశాకా జట్టు ఓడిపోతే - దానికి కూడా సచిన్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసినప్పుడు ఏడవలేక నవ్వడం; "గంగూలీ సందులో గజ్జెల గోల" అని వేటూరి రాసేడని టెండూల్కర్ గురించి ఎప్పుడూ వినని "ఆడి చూడు క్రికెట్టూ టెండూలర్ అయ్యేటట్టు.." పాట నేర్చుకోవడం -- ఎన్నని వ్రాయను? జీవితపు ప్రతి మలుపులోనూ పక్కనే ఉన్నట్టనిపించే మనిషి గురించి - మన వాడనిపించే - ఈ క్రీడాకారుని గురించి, అతనితో పెనవేసుకున్న నా అనుభవాల గురించి...ఇంకెన్ని వ్రాయను ?
అందుకే అతనొట్టి ఆటగాడంటే నాకొప్పుకోబుద్ధి కాదు. కొన్ని వేల జీవితాలపై చెరగని సంతకం- సచిన్!
స్కూల్ జీవితం, ఇంటర్మీడియట్టూ, మొత్తం నా డైరీలన్నీ అతని రికార్డులతో నిండి ఉండేవి. రెండు మ్యాచుల్లో అతను యాభై పరుగులైనా చేసి ఉండకపోతే, మూడో మాచ్లో ప్రత్యర్థిని తల్చుకుని నవ్వుతూ నే చేసిన ఊహాగానాలన్నీ నిజం చేసి చూపించేవాడు సచిన్. నా పుస్తకాల బీరువా లోపలి వైపు ఇన్నేళ్ళలోనూ నేను అతికించుకున్న ఒకే ఒక్క ఫొటో సచిన్‌ది. మరొకరి కలను నా కలగా అనుభవించానూ అంటే అది అతనిది. ఒక ఆట - ఇరవైరెండు మంది ఆడే ఆట అంత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటుందని నాకు నేర్పింది సచిన్. అందుకే, చాలా లక్షల కోట్ల మందికి మల్లే, " Sachin is the God of cricket" అని నేను అనను. ఎందుకంటే నాకు క్రికెట్ , సచిన్ వేరు కాదు. క్రికెట్ అంటేనే సచిన్!!
------
ఇంతా చేసి నేనెప్పుడూ అతను సెంచురీ చేయగా చూడలేదు. (టి.వి లో కూడా). ప్రతీ సారీ మా అక్క బాల్కనీలో చీకట్లో చేతులు నులుముకుంటూ కూర్చున్న నన్ను లాకెళ్ళి చూపిస్తే చూడడమే. 98 పరుగుల నుండి టి.వి ముందు కూర్చునే సహనం లేకపోయేది.
రెండవ లోటు - జట్టు సగర్వంగా ప్రపంచ కప్ పట్టుకున్న క్షణాల్లో నేను బెల్జియం నుండి తిరిగి వస్తున్నాను. జెట్ ఏర్వేస్ వాడు పావుగంటకొకసారి స్కోర్ చెప్పి, చాక్లెట్లిచ్చి మమ్మల్ని చిరఋణగ్రస్తులను చేసేశాడు. బెంగళూరుకు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో నేను ముంబైలో దిగి, రావలసి వచ్చింది. అక్కడ దిగగానే లగేజీలు కూడా వదిలేసి సగం మంది టి.విల ముందుకు పరుగులెత్తాం. మొహాల నిండా త్రివర్ణాలతో ఎంత మంది ఎదురొచ్చి అభినందనలు తెలిపారో, ఎంత మంది స్వీట్‌లు ఇస్తూ తిరిగారో లెక్కే లేదు. ఆ రోజు ముంబైలో దీపావళి జరిగిందా అని ఆశ్చర్యపోయిన వాళ్ళదీ తప్పేం కాదు. బెంగళూరు ఫ్లైట్ ఆఖరు క్షణాల్లో అందుకుని, నా పక్కన కూర్చున్న ఇరవయ్యేళ్ళ అబ్బాయి " నేనతన్ని చూశాను" అని ఉద్వేగంగా చెప్పినప్పుడు, నాలో అసూయను తొక్కిపెట్టి సంతోషం ఎగసిపడటం ప్రపంచ కప్‌ను ముద్దాడాలన్న సచిన్ పాతికేళ్ళ కలల సాక్షిగా నిజ్జం.
------
ఈ ఒక్క పోస్ట్‌కీ కామెంట్స్ డిసేబుల్ చేశాను. ఇది క్రికెట్‌కు సచిన్ నిజంగా సేవ చేశాడా లేదా, అతని రికార్డులు దేశానికి పనికొచ్చాయా లేదా , అతను నిస్సందేహంగా గొప్ప బాట్స్‌మన్ అవునా కాదా అన్న అంశాల మీద సాధికారంగా చర్చలు చేయాలని భావిస్తున్న అనేకానేక ఔత్సాహిక విమర్శకులకు వేదిక కావడం పట్ల ఆసక్తి లేక. అలాగే సచిన్ నిజంగా ఇందరి అభిమానానికి అర్హుడా కాడా అన్న విషయం మీద కూడా కొందరు ఉచితంగా చేయబోతున్న జ్ఞానబోధలు స్వీకరించగల స్థితిలో లేక.
---
Dear Sachin - You are the pride of this nation and you have inspired millions of this country in one way or the other. We love you!
No comments:
New comments are not allowed.