భీత హరిణి


ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా రాసిన కవిత ఇది. నేను చదువుకునే రోజుల్లో కూడా ర్యాగ్గింగ్ ఉండేది.అందులోనూ మా కాలేజీ (సిద్ధార్థ, విజయవాడ) ఇటువంటి వాటికి పెట్టింది పేరు. అయినా చదువయ్యే సరికి కేవలం స్నేహాలే తప్ప గొడవలు గుర్తుండకపోవడం నా జ్ఞాపకశక్తి నాకిచ్చిన వరం ;)


ఈ కవితను, హంసిని వెబ్ పత్రిక వారు ప్రచురించారు.
http://hamsini.andhraheadlines.com/Sections/Details.aspx?CatID=5&AuthId=22&ArtId=65

*****************************************

అమ్మా నాన్నల అల్లారు ముద్దు పెంపకంలో
ఆకాశమే హద్దుగా సాగిన విజయ ప్రస్థానం నాది
కన్న వాళ్ళ శత కోటి కలలను నిజం చేసేందుకు
తొలిసారిగా గూడు వీడిన ఓ లేత గుండె చప్పుడిది

నన్ను చూస్తూనే.. మర్యాద ధ్వనించని చప్పట్లు
దగ్గరకు రమ్మంటూ కరడు గట్టిన గళాల పిలుపులు
నా మానస వీణలో   మెదిలిందేదో     అపశృతి
ఆకలి గొన్న సింహపు ముంగిట లేడి పిల్ల స్మృతి!

నిస్సహాయంగా నిల్చున్నాక విచారణ పేరిట వేధింపులు
వంద మందీ ఒక్కటయ్యాక వెర్రి ప్రశ్నలతో సాధింపులు
ఆధిపత్యం నిలబెట్టుకోను అర్థం లేని అరుపులు
తప్పేంటో తెలీనివ్వక క్షోభ పెట్టే ఎగతాళి చూపులు..

నా స్వప్న సౌధపు పునాదులను
ఎవరో పెకిలిస్తున్న భావనలు నాలో
నేనూహించుకున్న పవిత్ర ప్రపంచపు
మౌనపు వెక్కిరింపులు లోలో....!!

ఒక్కసారిగా ఉప్పెనలా విరుచుకు పడే విమర్శనాస్త్రాలు
జీవితానికి సరిపడే బాధని మిగిల్చిన గాయాలు
క్యాంటీన్ లోకి వెళ్ళనీక ఆపిన భయాలు-బిడియాలు
ఆకలి మంటల నార్పలేక కన్నీరోడ్చిన జ్ఞాపకాలు ...

అర్థ రాత్రి దాటినా ఆగని వంకర ప్రశ్నలకు
అలసి పడిన చేదు చీకటి అనుభవాలు
ఎదురు తిరిగిన ప్రతి చోటా ప్రతి సారీ
ఎదను కోసేసిన అవమాన భారాలూ..

తన వాళ్ళనే తోడేళ్ళై కబళించే తత్వమింకా సమసి పోలేదనీ..
ఆటవిక యుగపు దాఖలాలు చుట్టూరా మిగిలే ఉన్నాయనీ
మనందరికీ తేల్చి చెప్తుంటే,సిగ్గుతో తల దించుకోమంటుంటే
ఏ వెలుగులను వెదుక్కుంటూ సాగిస్తున్నాం మనమీ ప్రస్థానం..?

మరో ప్రపంచాన్ని పరిచయం చేసెదెవరని మూర్ఖంగా అన్వేషించక
మార్పు తెచ్చేందుకు మహాత్ముడే రావాలని మౌనంగా నిరీక్షించక
ఎన్నటికీ అమలు కాని చట్టాల డొల్లతనాన్ని గేలి చేస్తూ
కుల మత వర్గ  విభేదాలను  కళాశాల కావలే  ఆపేస్తూ ..
                                        ఇప్పుడైనా చేతులు కలుపుదాం..!!

మానవత్వపు పరిమళాలు వాడనివ్వని వాడే
'మనీషి' అని మరో మారు చాటేందుకు..
విద్యాలయాల్లో విజ్ఞాన జ్యోతులే ప్రకాశిస్తూ
రాక్షస క్రీడలన్నీ అంతరించిపోయేటందుకు...!

8 comments:

  1. బావుందండి.అలాగే మీ కథానికకు మొదటి బహుమతి వచ్చినందుకు శుభాకాంక్షలు

    ReplyDelete
  2. @ Lokesh garoo, meerekkada choosaru? Hamsini site lona? thanks u soo much for the wishes :):).
    and once it gets published, pls read n let me know ur feedback also.

    @Gopal garoo - Thank you very much. :)

    ReplyDelete
  3. chaala bagundi. ee kavita hamsini vaaru prachurinchatam valana vacchina gouravam kante, siddhartha lanti college lo Dashboard meeda notice laga unchite, First Year students andaru roju

    ఎన్నటికీ అమలు కాని చట్టాల డొల్లతనాన్ని గేలి చేస్తూ
    కుల మత వర్గ విభేదాలను కళాశాల కావలే ఆపేస్తూ ..ఇప్పుడైనా చేతులు కలుపుదాం..!!


    ani "Vandemataram..." laga chaduvukunte marinta gouravam kalugutundi.

    Appudu ee kavitha manasu ke kakunda, Manishi(student) ki upayogapadutundi.

    ReplyDelete
  4. @KumaraSarma - thank u very much for ur feedback.

    ReplyDelete
  5. every line is awesome.
    Thnx for the post.

    ReplyDelete
  6. బాటసారిగారూ, ధన్యవాదాలు!

    ReplyDelete
  7. మానసగారు,

    ఇక్కడ మేము ఉండేచోట జింకలు ఎక్కువ, రోడ్ల మీద అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి! కొన్నిసార్లు కార్ల కింద కూడా పడుతూ ఉంటాయి :-(. ఒకసారి నేను, మా స్నేహితుడు ఆఫీసు నుంచి కొంచెం చీకటి పడిన తరువాత వస్తున్నాము, కొంచెం వేగంగానే. హఠాత్తుగా రోడ్ మధ్యలో, కార్ కి సరిగ్గా పదిహేను అడుగుల దూరంలో ఎక్కడి నుంచో నాలుగు జింకలు ప్రత్యక్షమయ్యాయి. మేము సడన్ బ్రేకు వేసి ఆపితే, కార్ జింకలకు సరిగ్గా రెండు అడుగుల దూరంలో పెద్ద కీచు శబ్ధంతో ఆగిపోయింది. ఆ కార్ లైట్ల వెలుగులొ మెము, ఆ జింకలు చేతలుడిగి నిశ్చేష్టులమై మేము వాటినీ, అవి మమ్మల్నీ చూస్తూ ఉండి పొయాము. 2-3 సెకన్ల తరువాత ఆ జింకలు తేరుకొని ఛెంగున రోడ్ దాటి లిప్తపాటులో మాయమయ్యాయి. కాని ఆ జింకల కళ్ళు, వాటిలో భయం మాత్రం అలాగే నా మస్తిష్కంలొ ఉండి పోయింది, అది జరిగి సంవత్సరం దాటిన తరువాత కూడా! మీ కవిత పేరు చూడగానే అదే గుర్తుకు వచ్చింది.

    మీ కవిత బాగుంది. :-) పైన kumarasarmaగారు అన్నట్టు కాలేజీలలొ మొదటి సంవత్సరం వాళ్ళు చూసేట్టు పెడితే బాగుంటుంది, ముఖ్యంగా మీ కాలేజీలో!

    /* చదువయ్యే సరికి కేవలం స్నేహాలే తప్ప గొడవలు గుర్తుండకపోవడం నా జ్ఞాపకశక్తి నాకిచ్చిన వరం ;)

    మీ ఈ వరం గురించి ముందు ఎప్పుడో comment చేసినట్టున్నాను??!! ;) :D


    -- శ్రీనివాస్

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...