అన్ని నీవనుచు..

ఆకాశపు కాన్వాస్ మీద అదృశ్య హస్తంతో
అంతరార్ధం వెతకమంటూ అలవోకగా రంగులద్దినా

ఉవ్వెత్తున ఎగసి పడే సాగర వీణియపై
అలల నురగల సంగీతం వినిపించినా

కలయికలూ కన్నీటి వీడ్కోల నడుమ
కాలాన్ని కమనీయ కావ్యంగా మలచినా

ఇసుక తెన్నెల్లో పున్నమి వెన్నెల పరిచి
సౌందర్యానికి సజీవ సాక్ష్యం చూపినా

వొళ్ళు విరుచుకుంటూ వచ్చే మట్టి వాసనను
జడి వానగా మారిన చినుకు స్పర్శకు కానుకిచ్చినా

మనసుల మధ్య యుద్ధాలైనా..సయోధ్యలైనా..
మనుషులు కొందరు మానవత్వం మరచి మృగాలైనా..

"ఎందుకన్నది" రహస్యంగానే మిగిలిపోనీ,
ఈ అసంతృప్తి ఏ కొందరినైనా దహించివేయనీ, పునీతులను చేయనీ!

ఎత్తులకు ఎదిగిపోతున్నానని తుళ్ళిపడే మానవుడు
తానెంత  అసమర్ధుడో ఏనాటికయినా తెలుసుకోనీ..!

ఆకసాన్ని అందుకున్న  గర్వం ఎంత  గొప్పదైనా..
మానసికంగా మరుగుజ్జవడం తప్పని తెలిసిరానీ..!!


By night, an atheist half believes in God. ~Edward Young, Night Thoughts

8 comments:

  1. Is there a subject that you ignored, Manasa?
    old-age homes, parents, sister, politics, freedom fighters, love, marriage, nature..

    so many thoughts in you..and they take such a lovely shape in letters...keep it up , Manasa

    ReplyDelete
  2. చాలా బాగుంది.మానవతను చూపలేని మానవుడు ప్రకృతి అందించిన బహుమానాలను మరచి తానెంతో గొప్పవాడినని మిడిసిపడే అల్పత్వాన్ని సొగసైన మాటలతో అల్లి కవితను రససమ్యం చేసారు.

    ReplyDelete
  3. It reminds me something which I read in my school days... Pure.

    Cheers
    Maandhatha
    http://twitter.com/Maandhatha#

    ReplyDelete
  4. Yes, I was also very influenced by that Novel. I picked up this name from there. YVN's latest one "Dega Rekkala Chappudu" is on grand scale like Casanova.

    Cheers

    ReplyDelete
  5. జిజ్ఞాసను జ్ఞానంగా మలచుకుంటున్న మనిషి...
    గర్వపడటంలో తప్పేముంది...?
    అవునవును మీరన్నట్టు..మితిమీరడం
    మళ్లీ తెలితక్కువతనమే.
    సృష్టిరహస్యాన్ని ఛేదించాననుకుంటే..
    ఉన్నచోటనే ఆగుతాంకదా...
    చలనంలేని జలం విషంగా మారినట్టు
    చెడుల హర్డిల్స్ లేకుంటే...
    లైఫ్ లో కిక్కేముంటుంది.
    అంతా మంచే అయితే...
    ఇక దేవునితో పనేంటి..!అందుకే ఆ రహస్యం.
    కళ్లు నెత్తికెక్కనీయడు మరి ఎన్నటీకీ...!!

    ReplyDelete
  6. చాలా బాగుంది.

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...