మానస సంగమం


తొలిసారి కట్టుకున్న కంచి పట్టు చీర అంచుల కిందుగా
దోబూచులాడే  తడి ఆరని పారాణి పాదాల అడుగుల్లో..
కాటుక  కన్నుల  కదలికల్లో దాగనన్న మెరుపుల మధ్య
క్రొంగొత్తగా కాంతులీనుతోన్న కళ్యాణపు  తిలకంలో
ప్రవాహంలా  సాగుతున్న  వేద మంత్రాల  నడుమ
సుముహూర్తాన తలపై వెచ్చగా తగిలిన నీ చేతిస్పర్శలో
రాలిపడే  ముత్యాల  తలంబ్రాల జల్లుల్లో నుండి
రహస్యంగా రెప్పలార్పుకుంటూ చూసే చూపుల్లో
బరువెక్కిన  మరుమల్లెల  పూల జడ  క్రిందుగా
మూడు ముళ్ళతో మెడలో పడ్డ పసుపు తాడులో
ఒళ్ళంతా కళ్ళు చేసుకు వీక్షించిన అగ్నిదేవుడి సాక్షిగా
ఒకరి వెనుక ఒకరం తడబడుతూ నడచిన ఏడడుగుల్లో ..
నా చుట్టూ చుట్టుకున్న నీ చేతుల మధ్య ఒదిగి
ఆకాశంలోని అరుంధతిని చూసిన ఆ అర్థ రాత్రిలో
..అప్పుడే ఎప్పుడో.. ..అక్కడే ఎక్కడో...
మనం సరికొత్తగా జన్మించిన సమ్మోహన క్షణాలేవో దొరలిపోయాయి.
అందాకా అపరిచితుడవైన నిన్ను ప్రియసఖుణ్ణి చేసిన బంధమూ
ఇన్నేళ్ల దూరాన్ని దూరం చేసిన రహస్యమూ
అందులోనే నిశ్శబ్దంగా ఒదిగిపోయాయి.

30 comments:

  1. samhita yallapragadaFriday, October 08, 2010

    beautifully written, yet again!
    Kudos to you, Manasa and to ur Manasa Sangamam..

    ReplyDelete
  2. రాలిపడే ముత్యాల తలంబ్రాల మధ్యలో నుండి
    రహస్యంగా రెప్పలార్పుకుంటూ చూసే చూపుల్లో
    బరువెక్కిన మరుమల్లెల పూల జడ క్రిందుగా
    చాలా బాగుందండి .మీ కవితలో భావం.

    ReplyDelete
  3. "...అప్పుడే ఎప్పుడో.. ..అక్కడే ఎక్కడో...

    నువ్వూ నేనూ సరికొత్తగా జన్మించిన సమ్మోహన క్షణమొకటి జారిపోయింది
    అప్పటి దాకా అపరిచితుడవైన నిన్ను...నాతో పెన వేసిన బంధమూ
    ఇన్నేళ్ల దూరాన్ని, దూరం చేసిన రహస్యమూ అందులోనే నిశ్శబ్దంగా ఒదిగిపోయింది."

    వావ్! ప్రతీ పద యుగళానికీ నీ దగ్గరో భాష్యం ఉంటుంది మానసా!

    అన్నట్టు ఆ చివరి క్షణం తప్పితే, నేను మీ అన్ని క్షణాలని చూసేసాను కదా! :-)

    ReplyDelete
  4. మానస మనసు ని మెస్మరైజ్ చేసేసారు మీ కవిత తో ..... ఇంతకి పెళ్ళి గురించి రాశారేంటి చెప్మా.... ప్లీజ్ ప్లీజ్

    ReplyDelete
  5. @దిలీప్...అసలు నువ్వు ఏదీ చూళ్ళేదు..పెళ్ళికి రాలేదు కదా..!!

    ReplyDelete
  6. @సంహిత..ఎంత అందమైన పేరు...యండమూరి 'ప్రేమ' నవల గుర్తొస్తోంది ఈ పేరు చూస్తుంటే.. :)
    థాంక్స్ ..ఈ కవిత నచినందుకు..
    @వేణు శ్రీకాంత్..చాలా థాంక్సండి ..
    @రాధిక..కృతజ్ఞతలు..
    @మాలా కుమార్..ధన్యవాదాలండి..

    ReplyDelete
  7. @శివ రంజని..:) :) - మరీ ఇలా అడిగితే ఎలా చెప్పను..? అయినా నేను ఈ కాన్సెప్ట్ మీద రాయకూడదా.. ;);)

    ReplyDelete
  8. మానస గారూ. చాలా చాలా బాగుంది మీ కవిత.
    >>
    ...అప్పుడే ఎప్పుడో.. ..అక్కడే ఎక్కడో...
    నువ్వూ నేనూ సరికొత్తగా జన్మించిన సమ్మోహన క్షణమొకటి జారిపోయింది
    అప్పటి దాకా అపరిచితుడవైన నిన్ను...నాతో పెన వేసిన బంధమూ
    ఇన్నేళ్ల దూరాన్ని, దూరం చేసిన రహస్యమూ అందులోనే నిశ్శబ్దంగా ఒదిగిపోయింది.

    చాలా చాలా బాగుంది పై భావుకత్వం..:) Excellent..:)

    ReplyDelete
  9. @ మానసా
    :( :(
    ఖండిస్తున్నా.... ఈ దిగ్భ్రాంతిలో ఏం చెప్పాలో తెలియడం లేదు... దీనంగా వెంటనే ఆల్బం తీసి చూసుకో అని తప్ప ఇంకేమీ చెప్పలేకపోతున్నా... కట కటా!

    ReplyDelete
  10. అప్పుడే ఎప్పుడో.. ..అక్కడే ఎక్కడో...
    నువ్వూ నేనూ సరికొత్తగా జన్మించిన సమ్మోహన క్షణమొకటి జారిపోయింది
    అప్పటి దాకా అపరిచితుడవైన నిన్ను...నాతో పెన వేసిన బంధమూ
    ఇన్నేళ్ల దూరాన్ని, దూరం చేసిన రహస్యమూ అందులోనే నిశ్శబ్దంగా ఒదిగిపోయింది...

    meeru enta andamgaa start chesaaroo anthe andamgaa muginchaaru...aa mugimpu kudaa maro andamayina anbhuthini migulustundi

    ReplyDelete
  11. Chala baaga raasav manasa..

    ReplyDelete
  12. @manasu palike --thanks a lot..
    @deepthi- thanks you 'Deep't....am glad u are still reading this ;);)

    ReplyDelete
  13. hey Dileep...
    sorry ..sorry...really very very sorry..:( :(
    I must be totally out of my mind to say something like that :(!
    idigo anduke nuvvu Hyd raavali, urgent gaa maa intiki lunch ki vachey oka weekend..Your friend will be mighty surprised to find u back here.. :)

    ReplyDelete
  14. ఒక మంచి రోజు చూసుకుని వచ్చేస్తా... లంచ్ కి మెనూ ఏంటంటే...
    శుద్ధ గేదె నెయ్యి, పిండి ఒడియాలు,పుట్నాల పొడి, బీర కాయ పచ్చడి, బెండకాయ కొబ్బరి వేపుడు(వీలైతే వెరు శనగ, జీడి పప్పులు కూడా వేసి) , టొమాటో పప్పు, గుత్తి వంకాయ కూర, పప్పు చారు, రసం( కొత్తి మీరతో గార్నిష్ తప్పనిసరి),గెడ్డ పెరుగు.. చివర్లో వెనీలా ఐస్ క్రీం! :)

    ReplyDelete
  15. చాలా బాగుందండి. మొదటి రెండు వాక్యాలు చదవగానే బాగా నచ్చేసింది నాకు :)

    ReplyDelete
  16. wow. this is really beautiful telugu poetry. love it.

    ReplyDelete
  17. Hi Manasa,

    Chala bagundhi mee kavitha....

    ReplyDelete
  18. Hi Manasa...Stumbled upon this poem...and glad about that! What a beautifully written feeling! chaala baavundi.

    ReplyDelete
  19. @Sai Praveen, Anand,Lakshmi, and Sindhura..

    Thank you very much for your feedback and I am really very glad that u all liked it..!
    Keep visitin..'

    ReplyDelete
  20. bhaavukatwam danchaaru maanasaa. kala anedi purvajanma sukrutham anukuntaa. meeru ee vishayamlo adrustavanthulu.

    ReplyDelete
  21. wow such an ecstatic feeling expressed in most beautiful way..absolutely loved it Manasa. Keep writing more for us.

    ReplyDelete
  22. పెళ్లి కి ఇంత కన్నా మంచి భాష్యం దొరకదేమో

    ReplyDelete
  23. అప్పటి దాకా అపరిచితుడవైన నిన్ను...నాతో పెన వేసిన బంధమూ
    ఇన్నేళ్ల దూరాన్ని, దూరం చేసిన రహస్యమూ అందులోనే నిశ్శబ్దంగా ఒదిగిపోయింది.
    పెళ్ళికి ఎంత చక్కని అర్ధం చెప్పారు.చాల బావుంది.

    ReplyDelete
  24. baagundi nasa..

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...