ప్రేమే నేరమౌనా..

-
నా పట్ల అతనికున్న నిర్లక్ష్యాన్ని భరించే నిబ్బరాన్ని కోల్పోయాను.

నాకు నేను ఎన్ని సార్లు సర్ది చెప్పుకున్నా, ఈ గుర్తించబడని ప్రేమ ఎంత నిరర్ధకం! మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వారికే ఈ ప్రేమ తాలూకు గాఢత తెలీకపోవడం ఎంత బాధాకరం.నా ప్రేమ అతడి గుండెలను తాకిందనీ , నా మనసు అతనికి అర్థమైనదనీ ఒక్క మాటా...కాదంటే నాకొక్క సందేశమో, అదీ  కుదరదంటే చూపులతో ఒక్క చిరునవ్వో  విసిరేస్తే, ఆజన్మాంతం అతడి తలపుల్లో బతకగల బలమేదో ఎలాగోలా కూడగట్టుకుంటాను కదా..!

"నను వినా గతి ఎవ్వరనుచు..నగువో లేక బిగువో..." - ఎవరైనా విన్నారా ఈ త్యాగరాజ కీర్తన..?

ఆ శ్రీ రామ చంద్రుడేమో కాని, ఇతనికి మాత్రం ఖచ్చితంగా నేనంటే ఏదో చిన్న చూపు ఉంది. నేను ఎదురు చూసినంత సేపు కూడా నా కళ్ళ ముందు ఉండడు. నీ లానే నా కోసం ఎదురు చూసే వాళ్ళు కోటినొక్క మంది ఉన్నారు లేవోయ్ అన్నట్టు గర్వంగా చూస్తూ ఎప్పుడూ ఏదో పని ఉన్నట్టు అటూ ఇటూ పరుగులు తీస్తూనే ఉంటాడు. ఎవ్వరూ చూడకుండా అప్పుడప్పుడు నేను చేసే సైగలనీ, అతడికి మాత్రమే వినపడేలా నేను చెప్పిన రహస్యాలనీ అతడు గమనించాడో లేదో, అర్థం చేసుకున్నాడో లేదో, నాకు తెలిసే అవకాశమేదీ కనపడలేదు.అంతు చిక్కని ఆవేదనంతా ఆవిర్లుగా మారి అద్దం లాంటి నా మనసును మసక బారేలా చేస్తోంది.మళ్లీ ఎప్పటికో అతని తలపే తొలి ప్రభాత కిరణమై మసకనంతా ఒక్క పెట్టున తుడిచేసి అక్కడ అతని రూపాన్ని ప్రతిఫలింపజేస్తుంది .

 ఎంత ఆశ్చర్యం కదా...! - వశీకరణ మంత్రమేదో వేసి ఉండకపోతే, నాకు తెలీకుండానే నా మనసు అతని కోసమెందుకు పరితపిస్తుంది?!

పెదవి దాటిన ప్రేమకి నా దృష్టిలో పెద్ద విలువ లేదు. గుండెల్లో భద్రం గా దాచిపెట్టబడి మన ప్రతి చర్యలోనూ తానున్నంటూ పొంగి వచ్చే ప్రేమకున్న గొప్పతనం పొడి పొడి మాటల్లో ఏముంటుంది ?అయినా అన్నేసి గంటలు ఆత్రం గా ఎదురు చూసాక, చిట్ట చివరికి ఎప్పుడో చిలిపి నవ్వులతో ఎదురొచ్చాక, మెరిసే నా కన్నుల్లో అతను చదవలేని భావాలను, పదాల్లో పొందుపరచి వివరించి గెలవగలనంటారా?
ఏదేమైనా, ఇక  నాకు వేరే దారి లేదు..అతనికి నా ఇష్టం అంతా తెలియజెప్పాలన్న తపన నన్ను నిలువనీయడం లేదు.తొలి సారి ఎక్కడ నా మనసు అతన్ని చూసి తుళ్ళి పడిందో, అక్కడికే మళ్లీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.నెలలో ఒకటీ అరా రోజులు  తప్పిస్తే అతనక్కడికి క్రమం తప్పకుండా వస్తాడు. ఆ వేణు గోపాల స్వామి గుడి వెనుక కోనేటి దగ్గర ఎవరి కోసమో తచ్చట్లాడుతూ ఉంటాడు.

చివరికి నేను ఆశించిన ఘడియ రానే వచ్చింది. గుడి దగ్గర ఏ కారణం చేతో జనం పలుచగా ఉన్నారా వేళ..నేను ఒంటరిగా ఉన్నాను. అతడు కనిపించాడు..ఎదురుగా వచ్చాడు .ఇంత కన్నా మంచి తరుణం మళ్లీ దొరుకుతుందో లేదో అనుమానమే.కానీ నాకే...ఒక్క మాటా పెగలడం లేదు. అంత ఆవేదనా అక్కడే ఎక్కడో గొంతుకలో చిక్కుకు పోయింది.నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తోంది. రెప్పల కాపలాతో కన్నీటి  నాపుకుంటూ కోనేటి మెట్ల మీద మౌనంగా కూలబడ్డాను.

ఆశ్చర్యం.!

నేను ఊహించినట్టు అతడు నా మానానికి నన్ను వదిలి వెళ్ళిపోలేదు.నెమ్మదిగా నిశ్శబ్దం గా నా దగ్గరికి వచ్చి నన్ను చూసాడు. అతని కళ్ళలోకి చూసాను...
ప్రపంచమంతా మౌనం పరుచుకున్న అనుభూతి . అతడు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకూడదన్న కోరిక  ,ఆ క్షణం శాశ్వతం కావాలన్న అత్యాశ..అన్నీ ఒక్కసారే నన్ను చుట్టుముట్టాయి.నా కళ్ళల్లో కదలాడుతున్న భావాలను చదివినట్టుగా,ఇన్నాళ్ళూ నన్నింత బాధ పెట్టినందుకు నా క్షమాపణ వేడుతున్నట్టుగా నా పాదాల చెంతకు చేరుకున్నాడు.

అప్పుడే నేను ఒక పొరపాటు చేసాను.

నేను మామూలు స్థితిలో ఉన్నట్టలైతే అతన్నిముఖారవిందాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలని కోరుకునేదాన్నేమో.కాటుక కళ్ళల్లో నా ప్రేమను కూర్చి , వణికే పెదవుల్లో వలపును చేర్చి తొలి ముద్దిచ్చేదాన్నేమో...కాని నా మనసులో ఏ మూలనో ఉన్నా బాధ నన్ను లోకాన్ని మర్చిపోయేలా చేసింది. అణువణువునా నిండిన వేదన అహంకారంలా మారి కాలు విదిలించేలా చేసింది....

అంతే..!!

నిశ్చలంగా ఉన్న నీరంతా ఒక్కసారిగా చెల్లా చెదురయిపోయింది .తెప్పరిల్లి చూసేసరికి , పాదాల దగ్గరకు వచ్చి నా అలక తీరుస్తాడనుకున్న నా వాడు ఎప్పటి లాగే మళ్లీ అందనంత దూరం లో ఆకాశంలో కనపడ్డాడు.

నా లాంటి అమ్మాయిలను ఎందరినో చూసిన గర్వంతోనో ఏమో..ఏమీ జరగనట్టే, ఏదీ ఎరగనట్టే  నీలాకాశంలో వెలుగులు కుమ్మరిస్తున్నాడు.

ఈ రోజీ శరచ్చంద్రికను  చూసి ఏ అమ్మాయి మనసు పారేసుకోనుందో...!!
*** 
                                                                          

49 comments:

  1. Excellent...chandrudi gurincha..neninka nijam evaro abbayi anukunna :P

    ReplyDelete
  2. మానస చప్పట్లు ...చప్పట్లు చాలా చాలా చాలా చాలా బాగారాసావ్

    ReplyDelete
  3. మానసా!
    Too Good!
    చాలా బాగా రాశారు.. ఒకసారి చదివాక మళ్ళీ వెళ్ళి చదివాను..

    కృష్ణప్రియ/

    ReplyDelete
  4. ammai manasunu chala baaga chepparu

    ReplyDelete
  5. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు...............
    ఏ బాషలో ఐనా సరే మిమ్మల్ని పొగడడానికి కొత్త పదాలని సృష్టించాల్సిందే...............

    ReplyDelete
  6. చాలా బాగా వ్రాశారు మానస గారు

    ReplyDelete
  7. మానస గారు చాలా చాలా చాలా చాలా బాగారాసారు . నేను కూడా చంద్రుని గురించి ఒక poetry ఉంది english లో అది నా బ్లాగ్ లో పెడదాము అనుకుంటున్నా .... అది మాత్రం మీరు రాసినంత బాగుండదు

    ReplyDelete
  8. @రామ కృష్ణ రెడ్డి గారూ- చాలా థాంక్స్ అండి..అవును..అతడి గురించే...:)
    హాయ్ నేస్తం...చాలా చాలా చాలా చాలా థాంక్స్..:)))

    ReplyDelete
  9. @కృష్ణ ప్రియ గారూ..చాలా థాంక్స్ అండి..మీకు నచినందుకు చాలా సంతోషం గా ఉంది.
    @వంశీ.. నిజమేనా? అలా అయితే చాలా థాంక్స్.. :)
    @శృతి.. :) హృదయపూర్వక కృతజ్ఞతలు..:)
    @అసంఖ్యా.. షుక్రియా..!

    ReplyDelete
  10. @ Siva ranjani- thank you very very much sivaa..please do post the english poem too. I am eager to read it on your blog,
    @venkat - Thank you very much. I am really glad that u liked it

    ReplyDelete
  11. @ లోకేష్ శ్రీకాంత్ - మీకు నా ధన్యవాదాలండి..

    ReplyDelete
  12. అసలింత బాగా ఎలా రాసారండి మల్లి మల్లి చదవలనిపించేటట్టు

    ReplyDelete
  13. చాలా బాగుంది. కానీ మీరు మాతో చెప్తున్నట్టుగా రాశారు. అలా కాకుండా మీతో మీరే చెప్పుకుంటున్నట్టుగా రాస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అది తప్పితే మిగతా అంతా చాలా బాగా రాశారు. :)

    ReplyDelete
  14. bagundhi ..kani adhi ammayi ahankaramaa leka abadhratha bhavamaa leka aatmabhimanamm aa ammaye cheppali ....

    ReplyDelete
  15. It's really a good narration...........

    ReplyDelete
  16. భాను..
    చాలా థాంక్స్ అండి..:)
    @హరే కృష్ణ.. ధన్యవాదాలండి.
    @మాధవి..కృతజ్ఞతలు..
    @విశ్వ ప్రేమికుడు - అవునా..ఏదో మనసుకి తోచింది రాసేసాను.నిజానికి మీరు చెప్పేవరకు ఈ సంగతి నేను గమనించనే లేదు.
    ఇంకో సారెప్పుడైనా అలా ప్రయత్నించి చూస్తాను. మీ సూచనకు, అభినందనలకు కృతజ్ఞతలు..:)
    @ అజ్ఞాతలందరికీ.. -:)) :)) ..చాలా చాలా థాంక్స్ అండి.

    ReplyDelete
  17. @ అజ్ఞాత - అది బాధ వల్ల కలిగిన కోపం నుండి పుట్టిన ఆహంకారమేమో .. :):).
    On a serious note, I think it is very common. When you wait so much for someone, expressing all your pain will become the first priority than expressing love....
    Again, that's just my opinion. Would not want to generalize it.
    If you have something else on your mind, I perfectly understand that and respect it.

    ReplyDelete
  18. [:)] ..manasa garu ..I understand what you are trying to say ..
    I just said there are other angles too and it can be any of them or a combination of them ...

    ReplyDelete
  19. @ Anonymous:
    :)) Thank you..and am suprised to know that you are actually following the comments..Am glad that we could finally exchange our view points .
    Cheers..!

    ReplyDelete
  20. MANAS... excellent.. nee gurinchi review rayadaniki kooda ma bhasha saripodu. daanikee nee saayam kavalemo kadaa..nee chetha valapinchabadi aakasamlo aa chandrudu, bhoomi pyna marokaru adrushtavanthulayyaru....

    ReplyDelete
  21. బాగుందండీ. చదివేక మంచి ఫీల్ వచ్చింది.

    ReplyDelete
  22. మానస ji ,
    నాకే...ఒక్క మాటా పెగలడం లేదు. మరీ ఇంత బాగా రాసేవారు బ్లాగులో ఉండటం వారి సంఖ్య దిన దిన ప్రవర్థమాన మౌతూండం చలా మంచి విషయం. ఇదే పత్రికల లో వచ్చి ఉంటె చదవ కుండా మిస్ అయ్యె వాడిని. మీరు ప్రతి పదం లో భావాన్నికూరారు, ఏ పదం అనవసరం గా అనిపించలేదు టెంపోను తగ్గించలేదు.

    ReplyDelete
  23. @భావన గారూ..చాలా థాంక్సండి...
    @anonymous :
    ధన్యవాదాలండి. మీకు ఇది నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.

    ReplyDelete
  24. Wow...super manasa
    adirindi, akka cheppinattu ne saayam kaavali..

    ReplyDelete
  25. hii maaanii.. chala chala bagundi...ee lines chala baga nachayi..".అంతు చిక్కని ఆవేదనంతా ఆవిర్లుగా మారి అద్దం లాంటి నా మనసును మసక బారేలా చేస్తోంది.మళ్లీ ఎప్పటికో అతని తలపే తొలి ప్రభాత కిరణమై మసకనంతా ఒక్క పెట్టున తుడిచేసి అక్కడ అతని రూపాన్ని ప్రతిఫలింపజేస్తుంది."

    ReplyDelete
  26. మానస గారు, చాలా అధ్బుత౦గా వర్ణి౦చారు చ౦దమామను చూసిన ఓ అమ్మాయి అనుభూతిని. చదువుతున్న౦త సేపు ఏదో తెలియని ఓ ఆత్రుత, చాలా బావు౦ద౦డి. After many days, i looked into this & it is awesome.

    ReplyDelete
  27. After a decade YVN started writing fiction, "Dega Rekkala Chappudu" started in Sakshi daily -- in Sunday supplyment...
    thought you might be interested.

    --M.

    ReplyDelete
  28. @Deeps,
    @Haritha,
    @Prakash...Thanks a lot for your comments..
    :):)

    ReplyDelete
  29. chala baga rasavu manasa! abghutamaina bhava prakatana..

    ReplyDelete
  30. hemalatha garu..thanks a lot, it feels great to receive such comment from someone like you!

    Thank you very much..!

    ReplyDelete
  31. idhi chadhivaaka na purusha hrudayaniki moham kaligindha? leka sthree patla gauravam kaligindha? lekapothe aakasham loni aa challati raathi muddha meeda asooya kaligindha?

    ReplyDelete
  32. పెదవి దాటిన ప్రేమకి నా దృష్టిలో పెద్ద విలువ లేదు..
    మీరు చెప్పెంది..నిజంగా నిజం..
    దాగుడుమూతల అనురాగాలే..
    నిరంతరం అనుభూతుల్ని పూస్తాయి.
    మంచి భావుకత ఉంది మీకవితలో..

    ReplyDelete
  33. @colourofdarkness : :-) Interesting comment .. :)). I just saw it actually!

    @Vijay! Thanks, for patiently reading it , and for your feedback too.
    Keep visitin'..!!

    ReplyDelete
  34. నేనూ.. మీబ్లాగ్ కు కొత్తే..
    ఆమాటకొస్తే...బ్లాగుల ప్రపంచానికే కొత్తముఖాన్ని.
    అపుడపుడు అలా... వెదుకుతూ ఉంటా..
    మంచి కవితలంటే.. ప్రాణం.
    లక్కీగా మీబ్లాగ్ చూశా.. థ్యాంక్స్ ఎలాట్..
    మీ కవితాసుమాలకు..

    ReplyDelete
  35. One of the finest blogs I have read...and finest of them... KUDOS...

    ReplyDelete
  36. Thank you Vijay..!
    @Raj - am honored..thanks heaps..!

    ReplyDelete
  37. @Kranthi, @Mohan,

    Thank you so much for the wonderful feedback :)

    ReplyDelete
  38. మీ బ్లాగ్ కి నేను మాత్రం నా మనసు పారేసుకున్నాను.ఎంతో అందమయిన భావాలు...చక్కటి వ్యక్తీకరణ.

    ReplyDelete
  39. "నను వినా గతి ఎవ్వరనుచు..నగువో లేక బిగువో..."
    నేను చదివాను ఈ త్యాగరాజ కీర్తనని :)

    మళ్లీ ఎప్పటికో అతని తలపే తొలి ప్రభాత కిరణమై మసకనంతా ఒక్క పెట్టున తుడిచేసి అక్కడ అతని రూపాన్ని ప్రతిఫలింపజేస్తుంది.
    It's a WOW expression!

    ఎంత ఆశ్చర్యం కదా...! - వశీకరణ మంత్రమేదో వేసి ఉండకపోతే, నాకు తెలీకుండానే నా మనసు అతని కోసమెందుకు పరితపిస్తుంది?!
    ఆ ఆశ్చర్యానికి మరో పేరే కదా ప్రేమ?!

    రెప్పల కాపలాతో కన్నీటి నాపుకుంటూ
    వెరి రిచ్ ఎక్స్‌ప్రెషన్..

    అణువణువునా నిండిన వేదన అహంకారంలా మారి కాలు విదిలించేలా చేసింది...
    పాపం :( దీన్నే అన్నమయ్య చలముల అలుక అంటాడు. అమ్మావారికే అటువంటి ఈ గర్వం ఉన్నప్పుడు మామూలు మగువలకుండదా? :)

    ఈ రోజీ శరచ్చంద్రికను చూసి ఏ అమ్మాయి మనసు పారేసుకోనుందో...!!
    శరచ్చంద్రికను చూసి అమ్మాయిలేకాదు అబ్బాయిలూ పారేసుకుంటారుగా మనసు? నాకేమో, పారేసుకోలేని మనసు ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. కాదంటావా?

    ReplyDelete
  40. yentee, intha adhbutham gaa wraayachchaa!!!!! naaku maatallev!!!

    ReplyDelete
  41. ప్రేమకు ఒక భాష వుంటే బాగుండు అనిపించేది. ఇపుడే తెలిసింది అది మధుమానసం లో ఎపుడో పోస్ట్ అయిందని

    ReplyDelete

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...