ఉన్నట్టుండి నువ్వీ రోజు నా పక్కన లేవన్న నిజం గుర్తొస్తుంది. చేస్తున్న పని ఇహ ముందుకు కదలలేనంటూ మొరాయిస్తుంది. ప్రతి సాయంత్రం వదిలి వెళ్ళే సూరీడు ...తెల్లారగానే తన ఒంటిపై వెలుతురు మెరుపులు అతికించేందుకు వచ్చేస్తాడని ఆశపడే సంద్రంలా, రోజూ లాగే నీ కోసం వేచి చూసే హృదయం, ఇంకో రోజు నీ తలపులతోనే సరిపెట్టుకోవాలని అర్థమయ్యీ అవ్వగానే , మబ్బు పట్టిన ఆకాశంలా దిగాలు పడిపోతుంది.జీవితాన్నిమధురానుభూతుల దొంతరలా మార్చిన అందమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటి లాగే నా ఊహల అంబరం పైన ఎవ్వరూ చెరపలేని హరివిల్లులా అమరి కూర్చుంటాయి.
గుర్తుందా నీకు ?
వాకిట్లో పరుపల్లే పరుచుకున్న వెన్నెల్లో నీ ఒళ్ళో పడుకుని తలారబెట్టుకుంటూ చుక్కలు పెట్టిన ముగ్గుల్ని చూసుకుంటూ నేను..నా కళ్ళల్లో మెరిసే నక్షత్రాలని దర్శించుకుంటూ నీవు..మాటలు 'మాకిక్కడ చోటు దొరకడం లేదం' టూ అలిగి వెళ్ళిపోతుంటే..నిశ్శబ్దంగా నవ్వుకుని మన హృదయాలను ఊసులాడుకోనిచ్చిన రాత్రి గుర్తుందా నీకు ?నీ సాంగత్యంలో క్షణాల్లా గడిచిన ఆ శరద్రాత్రులని తల్చుకుని కదూ...కాలాన్ని నేనింత చిన్న చూపు చూసింది?ఇప్పుడు చూడు..నువ్వు పక్కన లేవన్న ధైర్యంతో, నిముషాల విల్లులను ఎక్కు పెట్టి, వాటిని జయించలేని అశక్తతతో నేను వాలిపోతుంటే..ఓడిపోతుంటే..పగలబడి నవ్వుతోంది పగబట్టిన కాలం.
కార్తీక మాసంలో...
కోనేటి మెట్ల దగ్గర కూర్చుని త్యాగరాజకీర్తన పాడుతూ..నీ అల్లరిచూపుల్లో చిక్కుకుపోయిన అలజడిలో..పదాలు తడబడుతున్న ఖంగారుని చూసి ఆపలేనంతగా నువ్వు నవ్వినప్పుడు...కోనేట్లోకి కోటి చందమామలెలా వచ్చాయని ఆకాశం ఆశ్చర్యపోయి ఉండదూ..?
నువ్వొచ్చాక పున్నమినీ, వెన్నెలనీ ఆరాధించడం మానేసానని గుర్తొచ్చి కాబోలు ...వెండి మంట లాంటి వెన్నెలని ఒంటరిగా ఉన్న నా చుట్టూ ప్రసరింపజేసి..తన ప్రతాపమంతా ప్రదర్శించాలని తొందరపడుతున్నాడా చందమామ.అతనికేం తెలుసు.. రెప్పలు మూసుకున్న మరు క్షణం మగతలా కమ్ముకునే నీ ఆలోచనలను చేధించ రానివనీ .. కన్నులు తెరిచిన తొలి నిముషంలోనే నీ తలపుల వెల్లువలో తిరిగి తలమునకలవుతాననీ...మీటర్లలో మనుషులు కొలుచుకునే ఈ దూరం మనని వేరు చెయ్యలేక ఓడిపోతుందనీ .. అతనికెప్పుడూ ఒంటరిగా దొరకననీ..!
అయినా అమావాస్య వస్తే అదృశ్యమయిపోవడమే తప్ప అనుక్షణం నీలా హృదయాకాశంలో వలపుల వెన్నెలలు కురిపించగలిగిన నేర్పు అతగాడికేదీ ?
"ముందు తెలిసెనా ప్రభూ.." అని పాడుకునే అవకాశం ఇవ్వవు అని ఎలాగో తెలుసు....అయినా తరగని తపన . అకస్మాత్తుగా నువ్వొస్తావేమో అని....అనంతంగా సాగుతున్నట్టు తోస్తున్న ఈ క్షణాన్ని సంహరించేందుకు ఒక్క చిరునవ్వు వరమిచ్చేందుకు ఎదురవుతావేమోనని ఏదో ఆశ. ఎదను కోసేస్తున్న ఎడబాటును భరించలేక ..ఎడమైపోయినా ఎదురుగానే ఉన్నట్టు అనిపిస్తుంటే యదార్ధమేదో తేల్చుకోలేక....ఏకాంతపు వనానికి వెళ్లి విశ్రాంతి తీసుకుందామనుకుంటే... ముప్పిరిగొనే తేనెటీగలల్లే..అవిగో మళ్లీ....అక్కడా నీ జ్ఞాపకాలే..!!
ఎర్రబడ్డ ఈ కళ్ళ కింద నలుపు చారలు దిద్దుతున్న కాటుక సరిదిద్ది ..తడారని రెప్పల మీద ఒక వెచ్చని గుర్తేదో వేసేందుకు నువ్వొస్తావని నిరీక్షిస్తున్న నన్ను నిరాశ పరచవు కదూ..!స్వాతి వాన కోసం ఎదురు చూసే ముత్యపు చిప్పనై నీ కోసం పరితపిస్తూన్న నన్ను చేరుకునేందుకు మెరుపులు దాచుకున్న మేఘమాలలో తేలి తక్షణమే వచ్చేస్తావు కదూ.. ?!
ప్రేమతో,
నీ..

Superb Manasa gaaru.
ReplyDeletechala bagumdi manasa garu nice.
ReplyDeleteBeautiful.
ReplyDeleteakkadi nundi vastudi ee uha shakthi...
ReplyDeletevennena manta...word excellent...
కోనేట్లోకి కోటి చందమామలెలా వచ్చాయని ఆకాశం ఆశ్చర్యపోయి ఉండదూ..?
ReplyDeleteWow......
Simply superb
అద్భుతం మానసా. ప్రేమను ఇంత ప్రేమగా వెలిబుచ్చటం బహుశా అందరికీ రాదేమో!
ReplyDelete@ రాహుల్ చంద్ర గారూ.. :) అందమైన ప్రేమ లేఖ అన్నందుకు ధన్యవాదాలు :)
ReplyDelete@సుమ లతా గారూ.. thank you very much. am happy that u liked it
@hanu ..thanks andi.
ReplyDelete@ ajnatha garoo.. thanks a lot
@madhu mohan garu - thank you very much for the compliments. :) . I wish I could write more such impressive articles.
ReplyDeleteFor now, blogs occupy my world n time :))
Hi Nakshatra.. :) - thank you. ప్రేమే నేర్పిస్తుందేమో ఆ మాటలన్నీ :)
ReplyDelete@విశ్వనాధ్ గారు ..కృతజ్ఞతలు. :). మొత్తం అంతా చదివి, ఓపిగ్గా ఒక్కో వాక్యాన్ని అభినందించడానికి చాలా గొప్ప అభిరుచి కూడా ఉండాలి.
నా రచనని ఆస్వాదిన్చినందుకు...అభినందించినందుకు..ధన్యవాదాలు.
@సమీర..మీ సమీర లోకం లోకి ఇప్పుడే అడుగు పెడుతున్నాను...:).మీ రచనలన్నీ చదివి మళ్లీ మిమ్మల్ని కలుస్తాను.
అన్నట్టూ..ప్రేమే ఒక అద్భుతం. ఆ అద్భుతానికి అక్షర రూపం ఇవ్వడం లో నేను సఫలీకృతురాలినయ్యానని మీరంటే..అదే పది వేలు నాకు :)
మానస గారు, మానసంలో విరిసిన మధుమాస వనంలో విహరించ గలగడమే జీవితంలో పొందగల అత్యంత మధురమైన ఆనందం. దానికి పరాకాష్టగా నిలిచిన మీ భావుకత సాహితీ ప్రియులందరికి ఆనందాన్ని పంచుతుంది. మీ "మధుమానసం" యొక్క ఆనందాన్ని మనసారా ఆస్వాదించాను.
ReplyDeleteమీ
సుమిత్ర
సుమిత్ర గారూ..
ReplyDeleteమీరన్నది అక్షర సత్యం .. :)
మీ అభిమానానికి, అభినందనలకి.. హృదయపూర్వక ధన్యవాదములు.
అబ్బా ! ఇంత అందమైన ప్రేమ లేఖ ని అందుకునే వారు నిజం గా అదృష్టవంతులే
ReplyDeletesiva ranjani garoo..thank u very much. am really glad that u liked this post :))
ReplyDeletemanasa veenaa madhu geetam...
ReplyDeleteanu'raaga' bharitam..aahlaada karam..
ee madhumanasam!!
{applicable to all ur blog posts, poetry}
~madhu
:)))))madhoo..thanks heaps.
ReplyDeleteKeep reading this blog n my posts.
:D
Manasa Chamarthi గారూ...,
ReplyDeleteనమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
చాలా బాగారాశారు. ఓ మంచి ప్రేమలేఖ చదివిన అనుభూతి. మీ బ్లాగుని మొన్నెప్పుడో కామెంటినప్పుడు చూశాను. మళ్లీ ఇప్పుడు. ఇక అప్పుడప్పుడూ వద్దామనుకుంటున్నాను. తరచూరాస్తారు కదూ.... :)
ReplyDeletechala chala bavundi vadina keep it up
ReplyDeleteవిశ్వ ప్రేమికుడు గారూ..
ReplyDeleteచాలా థాంక్స్ అండి. మీరు ఇలా క్రమం తప్పకుండా చదివి బాగున్నాయో లేవో చెప్తానంటే తప్పకుండా రాస్తాను.. :)
@రాకీ - thank you boy!!
enta bagundo ! cheppalenantha ga aakattukundi.
ReplyDeleteచుక్కలు పెట్టిన ముగ్గుల్ని చూసుకుంటూ నేను..నా కళ్ళల్లో మెరిసే నక్షత్రాలని దర్శించుకుంటూ
ReplyDeletechaala chaala baagundi........excellent feelings.
@savirahe..thank you Sir..!
ReplyDelete@Vinay Chakravarthi - Thank you very much
ఎంత అందమైన ప్రేమ లేఖ రాసారు మానస గారు...! చాలా బాగుంది.
ReplyDeleteకోనేట్లోకి కోటి చందమామలెలా వచ్చాయని ఆకాశం ఆశ్చర్యపోయి ఉండదూ..?
ReplyDeleteఎంత అందంగా రాసారు !!
కరోనా లాక్ డౌన్లో ఇంట్లో కూర్చొనిఉన్న నాకు, నా మనసు అట్టడుగు పొరల్లో దాగి ఉన్న సాహిత్యాభిలాష మీ రచనలను చూపించడం తటస్థించింది.సావిరహే నన్ను ఎక్కడికో తీసుకు వెళ్ళింది 30 సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవంలోకి వెళ్లి నా మనసు పులకించింది.కొన్ని క్షణాలు నన్ను నేను మరచి పోయాను. మనసులోని భావాలను అందించాలంటే ముందు ప్రేమ ఉండాలి దానికి అక్షర రూపం ఇస్తే అదే సావిరహే మీరు రచనను వర్ణించడానికి నాదగ్గర అక్షరాలు లేవంటే నమ్మండి ధన్యవాదములు.
ReplyDeletemanasa gariki,కరోనా లాక్ డౌన్లో ఇంట్లో కూర్చొనిఉన్న నాకు, నా మనసు అట్టడుగు పొరల్లో దాగి ఉన్న సాహిత్యాభిలాష మీ రచనలను చూపించడం తటస్థించింది.సావిరహే నన్ను ఎక్కడికో తీసుకు వెళ్ళింది 30 సంవత్సరాల క్రితం జరిగిన వాస్తవంలోకి వెళ్లి నా మనసు పులకించింది.కొన్ని క్షణాలు నన్ను నేను మరచి పోయాను మనసులోని భావాలను అందించాలంటే ముందు ప్రేమ ఉండాలి దానికి అక్షర రూపం ఇస్తే అదే సావిరహే మీరు రచనను వర్ణించడానికి నాదగ్గర అక్షరాలు లేవంటే నమ్మండి ధన్యవాదములు
ReplyDelete